పాన్ మాసాలా యాడ్ చేసే సెలబ్రిటీలు వాటిని తింటే ఎలా ఉంటారో తెలుసా?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-19 11:29:57  IST  )

ఏదైనా వస్తువును జనాల్లోకి తీసుకెళ్లాలి అంటే ప్రకటనలు తప్పనిసరి.

పాన్ మాసాలా యాడ్ చేసే సెలబ్రిటీలు వాటిని తింటే ఎలా ఉంటారో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ఏదైనా వస్తువును జనాల్లోకి తీసుకెళ్లాలి అంటే ప్రకటనలు తప్పనిసరి. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీ (Star Celebrity) ఆ వస్తువు ప్రమోట్ చేస్తే మరింత వేగంగా ప్రజలకు రీచ్ అవుతుంది. అందుకే పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్ని స్టార్ హీరోలను తమ కంపెనీ ప్రొడక్స్‌ను ప్రచారకర్తలుగా నియమించుకుంటాయి. అయితే, డబ్బుల కోసం కొంత మంది సెలబ్రిటీలు.. ప్రజల ఆరోగ్యానికి దృష్టిలో పెట్టుకోకుండా పాన్ మసాలా, గుట్కా, బీడీ, సిగరెట్, బీర్, ఆల్కహాల్ వంటి ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో షారుఖ్‌ ఖాన్‌, అజయ్‌ దేవగన్‌, అక్షయ్ కుమార్ వంటి బాలీవుడ్ (Bollywood) బడాబడా స్టార్స్ పాన్ మసాలా ప్రకటనల్లో పాల్గొనటంపై ఇటీవల సోషల్ మీడియాలో (social media) తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రకటనల్లో పాల్గొన్న నటీనటులు నిజంగా పాన్ మసాలా తింటూ సెల్ఫీలు తీసుకుంటే ఎలా ఉంటుందో చూపించేలా ఓ ఏఐ ఆధారిత వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

నిజానికి పాన్ మసాలా ప్రకటనల్లో నటించే సెలబ్రిటీలు ఎవరూ కూడా ఆ ఉత్పత్తులను వాడరు. కేవలం ఈ బ్రాండ్ ప్రమోషన్ కోసం వాళ్లు అందులో నటిస్తారు. అయితే, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో మాత్రం పాన్ మసాలా తింటే ఆ సెలబ్రిటీలు ఎలా ఉంటారనేది చూడవచ్చు. వారి దంతాలు పూర్తిగా నల్లగా మారిపోయి చూసేందుకు అసహ్యంగా కనిపిస్తున్నాయి. వీడియోలో అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గన్, క్రిస్ గేల్, రణ్‌వీర్ సింగ్, సల్మాన్ షాక్, అమితాబ్ బచ్చన్ తదితరల ప్రముఖ స్టార్స్ ఉన్నారు. ఈ వీడియోను పూర్తి హాస్యస్పాదంగా రూపొందించినప్పటికీ ముఖ్య ఉద్దేశ్యం కేవలం ఆ ప్రకటనల వాస్తవాలపై జనాలకు అవగాహన కల్పించేందుకు చేశారు.

పాన్ మసాలా ప్రకటనల్లో ప్రముఖుల పాల్గొనడం యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ ప్రకటనలు ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తులను ప్రోత్సహించడం వల్ల, ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, పలువురు ప్రముఖులు తమ నైతిక బాధ్యతను గుర్తించి, ఈ ప్రకటనలను తిరస్కరించడం అభినందనీయమైన విషయం. పాన్ మసాలా ప్రకటనలను తిరస్కరించిన నటుల్లో.. అనిల్ కపూర్, కార్తిక్ ఆర్యన్, అల్లు అర్జున్, యష్ ఉన్నారు.

Next Story