- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కోడి పందాలు’ సంస్కృతి ఎలా వచ్చిందో తెలుసా?’.. దాని వెనుక ఉన్న చరిత్ర ఇదే!
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంది.

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంది. పల్లెల్లో సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఇక తెలుగు వారి సంస్కృతిలో నేటికీ కోడి పందాలు భాగంగా ఉంటున్నాయనడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే.. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కోడి పందేలు నిర్వహిస్తునే ఉన్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు మంచి ఆదరణ ఉంది. ఈ క్రమంలో పందేం రాయుళ్ల బెట్టింగుల జోరు మాములుగా ఉండదు. అయితే పందేల పేరుతో జీవహింసకు పాల్పడుతున్నారని కోర్టులు ఈ కోడి పందాలను నిషేధిస్తున్న.. పందెం రాయుళ్లు మాత్రం ‘తగ్గేదే లే’ అన్నట్లు బరులకు సిద్ధమవుతున్నారు. ఈ కోడి పందాలు సంప్రదాయంగా వస్తున్నాయని.. ఇది సరదాగా ఆడే ఆటని కొందరు చెబుతున్నారు. కానీ ఈ కోడి పందేలా వెనుక చరిత్ర ఉంది.
కోడి పందాలు.. అసలు రహస్యం ఇదే!
ప్రాచీన కాలంలో యుద్ధాలు తప్పవనుకున్నప్పుడు లక్షల మంది చనిపోతారని, పౌరుషాలకు పోవద్దని పెద్దలు చెప్పేవారు. ఈ క్రమంలో పెద్దలు ఓ నిర్ణయన్ని తీసుకోవడం జరిగింది. అదేమిటంటే.. ‘తులారణం’ ప్రకారం ఇరుపక్షాల నుంచి ఒక్కో కోడిని ఎంపిక చేసి పందెం పెట్టేవారు. ఏదైతే చనిపోతుందో వారు ఓడిపోయినట్లుగా వారు నిర్ణయించుకున్నారు. దీంతో అశేష జన నష్టం తప్పి శాంతి ఏర్పడుతుందని ఆనాడు కోడి పందేలను ప్రోత్సహించారు.
ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కోడి పందాలు నిర్వహిస్తునే ఉన్నారు. కానీ కాల క్రమంలో కోడి పందాలు పౌరుషానికి ప్రతీకగా మారాయి. 11వ శతాబ్దం నాటి పల్నాటి రాజుల కాలంలో కోడి పందేలు వినోదానికి మాత్రమే కాకుండా పౌరుషానికి ప్రతీకగా ఉన్నట్లు సమాచారం. బాల నాగమ్మతో పందెంలో ఓడిపోయిన పల్నాటి బ్రహ్మనాయుడు అడవులకు వెళ్లినట్లు చరిత్ర చెబుతోంది. ఇక బొబ్బిలి, విజయనగర రాజుల మధ్య కూడా కోడి పందేలు పరువు-ప్రతిష్టల సమస్యగా ఉండేదంట. ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో కోడి పందేలకు విశేష ఆదరణ ఉంది.






