డెలివరీ చేసేందుకు వచ్చి బ్యాట్‌ను ముద్దాడిన డెలివరీ బాయ్.. క్యూట్ వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

ఓ బ్లింకిట్ డెలివరీ బాయ్ చేసిన పని ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బ్లింకిట్‌లో వస్తువులను ఆర్డర్ చేయగా డెలివరీ బాయ్ వాటిని తీసుకుని ఇచ్చేందుకు వెళ్లాడు.

డెలివరీ చేసేందుకు వచ్చి బ్యాట్‌ను ముద్దాడిన డెలివరీ బాయ్.. క్యూట్ వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ఓ బ్లింకిట్ డెలివరీ బాయ్ చేసిన పని ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బ్లింకిట్‌లో వస్తువులను ఆర్డర్ చేయగా డెలివరీ బాయ్ వాటిని తీసుకుని ఇచ్చేందుకు వెళ్లాడు. బాలుడు వచ్చిన పార్సిల్ తీసుకుని లోపలికి వెళ్లి డోర్ వేసుకున్న వెంటనే డెలివరీ బాయ్ పక్కన ఉన్న బ్యాట్ తీసుకుని బ్యాటింగ్ చేసినట్టు ఫోజులు ఇచ్చాడు. కొద్దిసేపు బ్యాట్ తో ఆడుకున్న తరవాత దానికి ఓ ముద్దు పెట్టి అక్కడే పెట్టేశాడు. తన పనికోసం వచ్చిన డెలివరీ బాయ్ బిజీ షెడ్యూల్ లో ఆ బ్యాట్ చూసి మురిసిపోవడం, చిన్నపిల్లాడిలా ప్రవర్తించడం చూస్తుంటే అతడికి క్రికెట్ పై ఎంత అభిమానం, ప్రేమ ఉన్నాయో తెలిసిపోతుంది. అంతేకాకుండా క్రికెట్ పై అతడికి ఎంత ఫ్యాషన్ ఉందో తెలుపుతుంది. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమ స్టైల్ లో కామెంట్లు పెడుతున్నారు. ఇండియాలో క్రికెట్ అంటే కేవలం ఆట కాదని ఓ ఎమోషనల్ అని అంటున్నారు. ఇక ఇప్పటికే ఈ వీడియోకు మిలియన్ల కొద్ది వ్యూవ్స్, లక్షల కొద్ది లైక్స్ వస్తుండగా క్యూట్ కామెంట్లు కూడా వస్తున్నాయి.

Next Story