AAP : 'ఆప్' ఓటమి.. అతిశీ డ్యాన్స్

by Muthe.Rajitha |   (  Updated:2025-02-09 11:28:47  IST  )

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు(Delhi Assembly Election Results) నేడు వెలువడగా.. ఎన్నికల్లో బీజేపి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

AAP : ఆప్ ఓటమి.. అతిశీ డ్యాన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు(Delhi Assembly Election Results) నేడు వెలువడగా.. ఎన్నికల్లో బీజేపి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఢిల్లీ గత మూడుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ఓటమి పాలైంది. దీంతో ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Aravind Kerjiwal) తోసహ కీలక నేతలు అంతా తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. అయితే పార్టీ చిత్తుగా ఓడిపోయిందనే బాధ కొద్దిగా కూడా లేకుండా ఆప్ కు చెందిన ఓ ముఖ్య నేత మాత్రం డ్యాన్స్ చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాని ఆప్ కేవలం 22 స్థానాలను దక్కించుకోగా.. వారిలో ఢిల్లీ మాజీ సీఎం అతిశీ మార్లెనా(Athishi Marlena) కూడా ఉన్నారు.

కల్కాజి నియోజకవర్గం నుంచి అతిశీ 3,500 ఓట్లతో ప్రత్యర్థి బీజేపీకి చెందిన రమేష్ బిధురి(Ramesh Bidhuri)పై విజయం సాధించారు. కాగా ఈ విజయాన్ని పురస్కరించుకొని ఆమె నియోజకవర్గంలోని ఆప్ శ్రేణులు సంబరాలు చేసుకోగా.. అతిశీ కూడా వారితో కలిసి డ్యాన్స్(Athishi Dance) చేశారు. అయితే పార్టీ ఘోరంగా ఓడినప్పటికీ స్వయంగా మాజీ సీఎం ఇలా డ్యాన్స్ చేయడం ఏమిటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం తన విజయాన్ని తాను ఎంజాయ్ చేస్తుంటే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో అతిశీ డ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కాగా ఆప్ ఓటమిపై ఆ పార్టీ అధినేత ఇంకా వివరణ ఇవ్వలేదు. ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తామని మాత్రం ప్రకటన జారీ చేశారు.

Next Story