అత్తను దారుణంగా కొట్టిన సాఫ్ట్ వేర్ కోడలు.. నెట్టింట వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

ఒకప్పుడు అత్తలు అంటే కోడళ్లు బయపడేవారు. కానీ ఇప్పుడు కోడళ్లను చూసి అత్తలు బయపడే పరిస్థితులు వచ్చాయి. పెళ్లికి ముందే అత్త మామ ఉండొద్దు

అత్తను దారుణంగా కొట్టిన సాఫ్ట్ వేర్ కోడలు.. నెట్టింట వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్:ఒకప్పుడు అత్తలు అంటే కోడళ్లు బయపడేవారు. కానీ ఇప్పుడు కోడళ్లను చూసి అత్తలు బయపడే పరిస్థితులు వచ్చాయి. పెళ్లికి ముందే అత్త మామ ఉండొద్దు..సింగిల్‌గా వేరే దగ్గర కాపురం పెట్టాలని కండిషన్స్ పెడుతున్నారు. ఇక ఒకవేళ కలిసి ఉన్న అత్తలతో గొడవలు పడుతూ వారికి తిండి కూడా పెట్టకుండా హింసించే వారు పెరిగిపోతున్నారు. తాజాగా ఓ కోడలు ఏకంగా అత్తపై దాడి చేసి దారుణంగా కొట్టింది. వయసు పైబడింది అని కూడా చూడకుండా కనికరం లేకుండా దాడి చేసింది.

అలా దాడి చేసింది కూడా ఉన్నత చదువులు చదివి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న మహిళ కావడం ఆశ్చర్యకరం. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని కవి నగర్‌లో చోటు చేసుకుంది. ఆకాంక్ష అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన అత్తతో గొడవల కారణంగా ఆమె పై దాడి చేసింది. గొడవ జరిగిన సమయంలో భర్త ఇంట్లో లేకపోవడంతో దాడి చేసినట్టు తెలుస్తోంది. జూన్ 30న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు కోడలిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దీంతో ఆమె కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. video

Next Story