రెండు బోగీల మధ్య డేంజరస్ జర్నీ.. రైల్వే పోలీసుల అదుపులో వ్యక్తి

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-01 12:13:21  IST  )

ట్రైన్ డోర్ దగ్గర నిలబడితేనే మనం షేక్ అయిపోతుంటాం. కానీ ఓ వ్యక్తి ఏకంగా రెండు బోగీలను జాయింట్ చేసే కప్లర్‌పై కూర్చొని వందల కిలో మీటర్లు ప్రయాణించిన షాకింగ్ ఘటన మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో ఇవాళ చోటుచేసుకుంది.

రెండు బోగీల మధ్య డేంజరస్ జర్నీ.. రైల్వే పోలీసుల అదుపులో వ్యక్తి
X

దిశ, వెబ్‌డెస్క్: ట్రైన్ డోర్ దగ్గర నిలబడితేనే మనం షేక్ అయిపోతుంటాం. కానీ ఓ వ్యక్తి ఏకంగా రెండు బోగీలను జాయింట్ చేసే కప్లర్‌పై కూర్చొని వందల కిలో మీటర్లు ప్రయాణించిన షాకింగ్ ఘటన మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... గోరఖ్‌పూర్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ వ్యక్తి అత్యంత ప్రమాదకరంగా ప్రయాణించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అందుకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

కాగా, సదరు వ్యక్తి రెండు బోగీలు కలిసే కప్లర్ ఏరియాలో ప్రాణాలకు తెగించి కూర్చుని ప్రయాణిస్తుండగా రైల్వే పోలీసులు గుర్తించారు. మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఆగిన వెంటనే అతడిని కిందకు దింపి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా ఎందుకు అలా ప్రయాణిస్తున్నావని ప్రశ్నించగా, సదరు వ్యక్తి పొంతలేని సమాధానాలు చెబుతూ ఉండటంతో పోలీసులు విస్మయానికి గురయ్యారు. ఈ మేరకు రైల్వే యాక్ట్ ప్రకారం సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ‘ట్రైన్ సర్ఫింగ్’ ఘటనల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే.

Next Story