- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ గన్‌తో డ్యాన్స్ గర్ల్ హంగామా.. ఇద్దరు కానిస్టేబుల్స్‌పై FIR.. వీడియో వైరల్
బీహార్ పశ్చిమ చంపారన్ జిల్లా రాంపురి బయరాగీ గ్రామంలో జరిగిన డాన్స్ కార్యక్రమం వివాదానికి దారితీసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: బీహార్ పశ్చిమ చంపారన్ జిల్లా రాంపురి బయరాగీ గ్రామంలో జరిగిన డాన్స్ కార్యక్రమం వివాదానికి దారితీసింది. నవంబర్ 26న జరిగిన ఈ కార్యక్రమంలో ఒక డ్యాన్స్ గర్ల్ ప్రభుత్వ పిస్టల్ పట్టుకొని డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో బయటకు రావడంతో పోలీస్ శాఖ అలర్ట్ అయ్యి వెంటనే చర్యలకు దిగింది.
ఈ ఘటనపై ముగ్గురిపై FIR నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. వారిలో ఇద్దరు కానిస్టేబుల్స్ ఉండటం సంచలనంగా మారింది. విచారణలో కానిస్టేబుల్ అమిత్ చౌదరి తన సర్వీస్ రివాల్వర్‌ను డాన్స్ గర్ల్‌కు ఇచ్చినట్టు బయటపడింది. అతడితో పాటు ఫైర్ సర్వీస్ అధికారి అన్మోల్ తివారీ, అమిత్ బంధువు మిశ్రా చౌదరి, ఇంకా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులపై కూడా కేసు నమోదు చేశారు.
వీడియో బహిరంగం కావడంతో పోలీసులు ఐటీ చట్టం, ఆర్మ్స్ యాక్ట్ కింద ముఫస్సిల్ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే వీడియో వైరల్ అయిన వెంటనే అమిత్ చౌదరి, అతని స్నేహితులు పరారైనట్లు సమాచారం. మరోవైపు, కార్యక్రమం సమయంలో ఒక గ్రామస్తుడితో జరిగిన వాగ్వాదం ఉద్రిక్తతలను పెంచింది. మొత్తం ఘటనపై పోలీసులు మరింత విచారణ చేస్తున్నారు. వీడియో ఇదే..






