‘నాన్నా.. లే’.. గుండెల్ని పిండేసే దృశ్యం! వీడియో వైరల్

by Ramesh Naini |

ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరుడైన SOG జవాన్ అమ్జద్ ఖాన్ పార్థివదేహం స్వగ్రామానికి చేరుకున్న సమయంలో అక్కడ నెలకొన్న హృదయ విదారక దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి.

‘నాన్నా.. లే’.. గుండెల్ని పిండేసే దృశ్యం! వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరుడైన SOG జవాన్ అమ్జద్ ఖాన్ పార్థివదేహం స్వగ్రామానికి చేరుకున్న సమయంలో అక్కడ నెలకొన్న హృదయ విదారక దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. అచేతనంగా పడి ఉన్న తండ్రిని చూసిన ఏడాది వయసున్న చిన్నారి ‘పప్పా.. పప్పా’ అంటూ పిలవడం చూసి అక్కడున్నవారంతా భావోద్వేగానికి లోనయ్యారు. చిన్నారి తన తండ్రి ఇక లేరన్న నిజాన్ని గ్రహించలేకపోవడం ఆ దృశ్యాన్ని మరింత బాధాకరంగా మార్చింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోను చూసిన నెటిజన్లు భావోద్వేగంతో స్పందిస్తున్నారు. ‘దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడికి సెల్యూట్’, ‘ఇలాంటి త్యాగాలను దేశం ఎన్నటికీ మర్చిపోదు’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు. అమ్జద్ ఖాన్ దేశ భద్రత కోసం చేసిన త్యాగం యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందని, ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని పలువురు కోరుతున్నారు. వీడియో ఇదే..

Next Story