- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థుల ఫ్యూచర్ గోల్స్‌పై నెట్టింట ఏఐ క్యూట్ వీడియో వైరల్
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది. అదీ ఇదీ అని కాదు.. విద్య, వైద్యం, వ్యవసాయం, వ్యాపారం, రవాణా, వినోదం.. ఇలా అన్ని రంగాల్లోనూ ఇప్పుడు ఏఐ ఊహించని మాయ చేస్తోంది. అందుకే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, అమెజాన్, మెటా వంటి దిగ్గజ టెక్ సంస్థలు ఏఐ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నాయి. అయితే, తాజాగా నెట్టింట ఏఐ రూపొందించిన ఓ సూపర్ క్యూట్ వీడియో వైరల్‌గా మారింది. సఫైర్ ఇంటర్నేషనల్ స్కూల్ (Sapphire International School) ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది.
వీడియోలో ఓ క్లాస్ రూమ్‌లోని విద్యార్థులు ఒక్కొక్కరిగా వచ్చి తను భవిష్యత్తులో ఏం అవ్వాలనుకున్నాడో చెబుతారు. వారు చెప్పిన వెంటనే ఏఐ టూల్స్ సాయంతో భవిష్యత్తులో వారు ఆ ఉద్యోగాలలో ఉన్నట్లుగా వెనుక వైపు ఉన్న స్క్రీన్‌పై చూపించారు. దీంతో క్లాస్ మొత్తం ఆనందంతో ఈ అద్భుత దృశ్యాన్ని చూస్తూ మురిసిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట 40 లక్షలకు పైగా వ్యూస్, 3 లక్షలకు పైగా లైక్స్ సంపాదించింది. 'ఏఐని ఇలా ఉపయోగించడం చాలా క్యూట్‌గా ఉంది' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.






