ఫ‌న్నీ మూవీ డైలాగ్‌తో క్యూట్ AI రీల్.. రీ-ట్వీట్ చేసిన సీఎం చంద్రబాబు

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-26 08:16:29  IST  )

‘నువ్వు నాకు నచ్చావ్’ మూవీలో వెంకటేష్ చెప్పిన కామెడీ కలెక్టర్ డైలాగ్‌తో సీఎం చంద్రబాబు ఏఐ (AI) వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఫ‌న్నీ మూవీ డైలాగ్‌తో క్యూట్ AI రీల్.. రీ-ట్వీట్ చేసిన సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఏఐ రీళ్ల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా సీఎం చంద్రబాబు (CM Chandrababu)కు సంబంధించిన ఓ ఫన్నీ ఏఐ రీల్ నెట్టింట విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. విక్టరీ వెంకటేష్ నటించిన ఆల్‌టైమ్ క్లాసిక్ హిట్ మూవీ ‘నువ్వు నాకు నచ్చావ్’లోని ఓ ఫేమస్ కామెడీ సీన్‌ను తన కూతురితో పాటు సీఎం‌కు అన్వయిస్తూ ఓ తండ్రి చేసిన రీల్ అందరినీ ఆకట్టుకుంటోంది.

వైజాగ్ కలెక్టర్ ఆర్ణ.. సీఎం కాన్ఫరెన్స్..

‘నువ్వు నాకు నచ్చావ్' చిత్రంలో ప్రకాష్ రాజ్‌ను బురిడీ కొట్టించడానికి హీరో వెంకటేష్ ఓ కట్టుకథ చెబుతాడు. ఓ చిన్నపిల్ల పెద్దయ్యాక కలెక్టర్ అవుతుందని, ప్రకాష్ రాజ్ బయట నిలబడితే లోపలి నుంచి ఆ కలెక్టర్ పిల్చే సీన్‌ను వెంకీ ఎంతో ఫన్నీగా వివరిస్తాడు. సరిగ్గా ఇదే సీన్‌ను ఏఐ టెక్నాలజీ సాయంతో రీ క్రియేట్ చేశారు. ఇందులో చిన్నారి ఆర్ణ పెద్దయ్యాక నిజంగానే వైజాగ్ కలెక్టర్ (Vizag Collector) అవుతుంది. ఆమె సీఎం చంద్రబాబు నాయుడుతో అధికారిక వీడియో కాన్ఫరెన్స్‌లో ఉండగా.. బయట గేటు వద్ద ఆమె తండ్రి వేచి ఉంటాడు. అప్పుడు ఆ చిన్నారి కలెక్టర్ స్పందించే విధానం, దానికి సీఎం చంద్రబాబు రియాక్షన్ సీన్లను ఏఐ ద్వారా ఎంతో క్యూట్‌గా, అద్భుతంగా సృష్టించారు.

ట్విట్టర్‌లో ప్రశంసించిన సీఎం చంద్రబాబు

అయితే, ఆ ఫన్నీ ఏఐ రీల్‌ను సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫారమ్స్‌లో పోస్ట్ చేయగా గంటల్లోనే లక్షలాది వ్యూస్‌తో వైరల్‌గా మారింది. ఆ వీడియో కాస్తా సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన నెటిజన్ క్రియేటివిటీకి ముగ్ధులయ్యారు. వీడియోను చూసి సరదాగా నవ్వుకున్న చంద్రబాబు.. తన అఫీషియల్ ఎక్స్ (X) ఖాతాలో రీ-ట్వీట్ చేస్తూ ప్రశంసలు కురిపించారు.

Next Story