రూ.810 ఫుడ్‌కు రూ.1473 వసూలు? స్విగ్గీ బాదుడుపై కస్టమర్ ఫైర్

by Ajay Maddhiboyina |

సుందర్ అనే కోయంబత్తూరుకు చెందిన ఓ కస్టమర్ తన ఇంటికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రెస్టారెంట్ నుండి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలని అనుకున్నాడు. స్విగ్గీలో ఫుడ్ ధర మొత్తం రూ.1473గా చూపించింది. దీంతో అవాక్కైన అతడు నేరుగా రెస్టారెంట్‌కు వెళ్లి అదే ఆహారాన్ని కొనుగోలు చేశాడు. నేరుగా వెళ్లగా కేవలం రూ.810కి అదే ఆహారం వచ్చింది.

రూ.810 ఫుడ్‌కు రూ.1473 వసూలు? స్విగ్గీ బాదుడుపై కస్టమర్ ఫైర్
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్ర‌స్తుతం ఫోన్‌లో ఆర్డర్ పెడితే చాలా క్షణాల్లో రెస్టారెంట్ల నుండి ఫుడ్ ఇంటివద్దకు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది ఆఫీసుల నుండి ఇంటి వద్ద నుండి కావాల్సిన రుచికరమైన ఆహారాన్ని ఆర్డర్ పెట్టుకుని లాగిస్తున్నారు. అయితే ఒకప్పుడు ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించిన యాప్స్ ఇప్పుడు ధరలు భారీగా పెంచేసి కస్టమర్ల నుండి దోచేస్తున్నాయి. డెలివరీ ఛార్జ్, హ్యాండిలింగ్ ఛార్జ్, జీఎస్టీ ఇలా రకరకాల పేర్లతో కస్టమర్ల నుండి భారీగా వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విసుగు చెందిన ఓ కస్టమర్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సుందర్ అనే కోయంబత్తూరుకు చెందిన ఓ కస్టమర్ తన ఇంటికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రెస్టారెంట్ నుండి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలని అనుకున్నాడు. స్విగ్గీలో ఫుడ్ ధర మొత్తం రూ.1473గా చూపించింది. దీంతో అవాక్కైన అతడు నేరుగా రెస్టారెంట్‌కు వెళ్లి అదే ఆహారాన్ని కొనుగోలు చేశాడు. నేరుగా వెళ్లగా కేవలం రూ.810కి అదే ఆహారం వచ్చింది. దీంతో అవాక్కైన కస్టమర్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి స్విగ్గీని నిలదీశాడు.

ఆర్డర్ పెట్టుకుంటే అదే ఆహారానికి ఏకంగా 81శాతం ధర ఎందుకు పెరుగుతుందని ప్రశ్నించాడు. అసలు ఈ ధరలు కొనేలా ఉన్నాయా అంటూ ఫైర్ అయ్యాడు. 2 కిలో మీటర్ల దూరానికే అధికంగా రూ.663 చెల్లించాలా అని మండిపడ్డాడు. దీంతో ఆ కస్టమర్‌కు నెటిజన్లు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ఫుడ్ డెలివరీ యాప్స్ కస్టమర్ల నుండి దారుణంగా వసూలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story