KFC చికెన్ బర్గర్ లొట్టలేసుకుంటూ తింటున్నారా ? ఈ వీడియో చూడండి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-07 11:57:20  IST  )

KFC చికెన్.. ఆ పేరు పలకడంతోనే చాలా మందికి నోరూరిపోతుంటుంది. ఇక సిటీల్లో ఉండే KFC అవుట్ లెట్స్ లో లభించే చికెన్ వింగ్స్, పెరీ పెరీ చికెన్, చికెన్ ఫ్రై లెగ్ పీసెస్, చికెన్ జింజర్ బర్గర్.. ఇలా చాలానే లాగించేస్తుంటారు.

KFC చికెన్ బర్గర్ లొట్టలేసుకుంటూ తింటున్నారా ? ఈ వీడియో చూడండి
X

దిశ, వెబ్‌డెస్క్: KFC చికెన్.. ఆ పేరు పలకడంతోనే చాలా మందికి నోరూరిపోతుంటుంది. ఇక సిటీల్లో ఉండే KFC అవుట్ లెట్స్ లో లభించే చికెన్ వింగ్స్, పెరీ పెరీ చికెన్, చికెన్ ఫ్రై లెగ్ పీసెస్, చికెన్ జింజర్ బర్గర్.. ఇలా చాలానే లాగించేస్తుంటారు. అయితే ఒక్క నిమిషం ఆగండి. KFC చికెన్ బర్గర్ ను ఎంతో ఇష్టంగా తినే ఓ కస్టమర్ కు షాక్ తగిలింది. ఒకసారి కాదు.. రెండుసార్లు ఆమెకి కుళ్లిన చికెన్ తో చేసిన బర్గర్ ఇవ్వడంతో కోపంతో ఊగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా అతను షేర్ చేసింది.

బెంగళూరు పరిధిలోని కోరమంగళ అవుట్ లెట్లో ఉన్న ఒక KFCకి వెళ్లిన కస్టమర్ హాట్ అండ్ స్పైసీ చికెన్ జింజర్ బర్గర్ ఆర్డర్ చేసింది. ఎంతో ఇష్టంగా తన ఆర్డర్ తీసుకుని తింటుండగా.. అది కాస్తా కుళ్లిన వాసన వచ్చింది. దాంతో వేరే బర్గర్ ఇవ్వాలని సిబ్బందిని కోరగా మరో బర్గర్ ఇచ్చారు. అది కూడా అలాగే వాసన రావడంతో సిబ్బంది గట్టిగా నిలదీసింది. సాస్ వల్ల అలా స్మెల్ వస్తుందనే కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఇష్యూ సాల్వ్ చేయకుండా వెజ్ బర్గర్ ఇచ్చి సరిపెట్టే ప్రయత్నం చేశారని ఆమె వాపోయింది. కిచెన్ ను చూడాలని పట్టుపట్టడంతో.. తొలుత వారించినా తర్వాత చేసేది లేక ఆమెను కిచెన్లోకి అనుమతించారు. అక్కడ కోల్డ్ స్టోరేజీలో చికెన్ దుర్వాసన వస్తోందని ఆమె ఆరోపించింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ను ఎక్స్ లో షేర్ చేయగా.. వాటిని చూసిన నెటిజన్లు KFCపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Next Story