ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేసరికి దండెంపై కనిపించని దుస్తులు.. సీసీటీవీలో జరిగింది చూసి షాకైన వ్యక్తి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-22 09:43:11  IST  )

సోషల్ మీడియాలో ఏదైనా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న వీడియో కనిపిస్తే దానిని నెటిజన్లు ఎంత వైరల్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేసరికి దండెంపై కనిపించని దుస్తులు.. సీసీటీవీలో జరిగింది చూసి షాకైన వ్యక్తి
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ఏదైనా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న వీడియో కనిపిస్తే దానిని నెటిజన్లు ఎంత వైరల్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఎవరైనా ఎవరికైనా చిన్న హెల్ప్ చేస్తే.. అలాంటి వీడియోలను బాగా వైరల్ చేస్తుంటారు. తాజాగా నెట్టింట ఆ కోవకు చెందిన ఒక వీడియో వైరల్ అవుతోంది.

వర్షం వచ్చేలా ఉంది.. బయట ఆరేసిన బట్టలు తీయండి అని ఇంట్లో అమ్మ అరిచి చెప్పినా వినిపించుకోని పిల్లలున్నారు. ఈ వీడియోలో కొరియర్ డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తి వర్షంలో బట్టలు తడిచిపోకుండా తీసి ఆ ఇంటి ఆవరణలో పెట్టడం కనిపించింది. ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన ఒక కొరియర్ డెలివరీ బాయ్ చేసిన ఈ పని నెటిజన్ల మనసుల్ని హత్తుకుంటోంది. ఆ ఇంటి ఆవరణలో ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యం రికార్డవ్వగా.. దానిని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

గురుప్రీత్ సింగ్ అనే వ్యక్తి బ్రిస్బేన్ లోని లోగన్ లో డెలివరీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతను ఓ ఇంటికి పార్శిల్ డెలివరీ చేయడానికి వెళ్లిన సమయంలో వర్షం మొదలైంది. వెంటనే పార్శిల్ ను డోర్ వద్ద ఉంచి.. తాడుపై ఆరేసి ఉన్న బెడ్ షీట్స్ ను తీసి తడవకుండా ఉంచాడు. రోడ్డుపై యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు పోయేలా ఉన్నా కనీసం సహాయం చేయని ఈ రోజుల్లో వర్షంలో బెడ్ షీట్స్ తడవకుండా తీయాలన్న ఆలోచన రావడంలోనే అతనెంత మంచి వ్యక్తో తెలుస్తుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అతను ఏ కంపెనీలో పనిచేస్తున్నాడో వారికి ఫోన్ చేసి, జీతం పెంచడంతో పాటు ప్రమోషన్ ఇవ్వాలని అడగాలని ఓ యూజర్ కామెంట్ చేశారు.

Next Story