- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గూగుల్ మ్యాప్స్ ఎంతపని చేసిందీ... వరదలో చిక్కుకున్న జంట
కేరళ(Kerala)లో ఓ జంట గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించి కారుతో వరద నీటిలో చిక్కుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : కేరళ(Kerala)లో ఓ జంట గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించి కారుతో వరద నీటిలో చిక్కుకుంది. భారీ వర్షాల కారణంగా కేరళలోని కొట్టాయం జిల్లాలోని కడుతురుతిలో రోడ్లు వరద(Floods) నీటితో నిండిపోయాయి. ఇదే సమయంలో జోసి జోసెఫ్ (62) అనే వ్యక్తి తన భార్య షీబా (58) తో కలిసి ఎలక్ట్రిక్ కారులో వెళ్లారు. చెత్తిపుజా నివాసులైన ఈ దంపతులు మనవెట్టంలోని స్నేహితుడి ఇంటికి గుగూల్ మ్యాప్(Google Map) చూపిన దారిలో వెళ్తుండగా ఒక చోట వరద నీటిలో చిక్కుకుపోయారు.
కారు ముందు భాగం మొత్తం నీటిలో మునిగింది. గమనించిన స్థానికులు అందులోని దంపతులను రక్షించారు. అనంతరం అనంతరం ఫైర్ అండ్ రెస్క్యూ బృందాల సహాయంతో కారును నీటి నుంచి బయటకు తీశారు. ఈ ప్రాంతంలో గతంలో కూడా గూగుల్ మ్యాప్స్ కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరిగాయని, అధికారులు హెచ్చరిక బోర్డులు లేదా క్రాష్ బారియర్‌లు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని స్థానికులు ఆరోపించారు.






