రీల్స్ మోజులో స్టంట్స్ చేసిన జంట.. బొక్క బోర్లా పడి తీవ్ర గాయాలు.. వీడియో వైరల్

by Ramesh Naini |

సోషల్ మీడియాలో రీల్స్ కోసం కొంత మంది యువత ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

రీల్స్ మోజులో స్టంట్స్ చేసిన జంట.. బొక్క బోర్లా పడి తీవ్ర గాయాలు.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో రీల్స్ కోసం కొంత మంది యువత ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రైల్వే ట్రాకులు, నడి రోడ్లు, కొండలు ఇలా అనేక ప్రాంతాల్లో ప్రమాదకరంగా రీల్స్ క్రియేట్ చేస్తూ కొంత మంది ప్రాణలను రిస్క్‌లో పెడుతున్నారు. తాజాగా రాత్రి వేళ బైక్‌పై స్టంట్ చేస్తూ ఓ జంట ఘోర ప్రమాదానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

వైరల్ వీడియో ప్రకారం.. రాత్రి వేళ బైక్‌పై నడి రోడ్డు మీద ఓ జంట బైక్ స్టంట్ చేస్తుంది. వెనుక సీటులో కూర్చున్న యువతి, ముందు హ్యాండిల్ పట్టుకున్న యువకుడు రోడ్డు మీద వేగంగా దూసుకెళ్తూ స్టంట్ చేశారు. బైక్ ముందు టైర్‌ను పైకి లేపి స్టంట్ చేస్తుండగా అదుపు తప్పి వాహనం బొక్క బోర్లా పడి పోయింది. అదే సమయంలో వెనుక వస్తున్న మరో బైక్ వీరిపై నుంచి వెళ్లడంతో అది కూడా స్కిడ్ అయింది.

ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా యువతి కాళ్లపై నుంచి బైక్ వెళ్లడంతో ఆమెకు తీవ్ర గాయాలైనట్లు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రీల్స్ కోసం రియల్ లైఫ్‌నే పణంగా పెట్టడం అవసరమా..? అని చాలా మంది నెటిజన్‌లు జంటపై మండిడ్డారు. బైక్ పై స్టంట్స్ చేయడం ఎందుకు..? బొక్క బోర్లా పడి కాళ్లు విరగ్గొట్టుకోవడం ఎందుకని నెటిజన్‌లు ప్రశ్నించారు.వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని నెటిజన్‌లు డిమాండ్ చేశారు. వీడియో ఇదే..

Next Story