Viral: రీల్స్ పిచ్చి పీక్స్.. పాపులారిటీ కోసం రిస్క్.. ఏకంగా రైల్వే వంతెనపై జంట వీడియో వైరల్

by Ramesh Naini |

పాపులర్ అయ్యేందుకు వెనకా ముందు ఆలోచించకుండా కొంత మంది యువత రెచ్చిపోతున్నారు.

Viral: రీల్స్ పిచ్చి పీక్స్.. పాపులారిటీ కోసం రిస్క్.. ఏకంగా రైల్వే వంతెనపై జంట వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: యువతలో (Reel) రీల్స్ పిచ్చి రోజు రోజుకు ముదిరిపోతుంది. పాపులర్ అయ్యేందుకు వెనకా ముందు ఆలోచించకుండా కొంత మంది రెచ్చిపోతున్నారు. ఫాలోవర్స్, ఫ్యూస్, లైక్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టి వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. డేంజరస్ వీడియోలు చేసి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. అయితే, తాజాగా ఓ జంట చేసిన డేంజర్ రీల్ చూసి నెటిజన్‌లు షాక్ అయ్యారు. అక్కడ ఇక్కడ రీల్స్ చేస్తే కిక్కు ఏమొస్తుందని అనుకున్నారో ఏమో కానీ.. ఏకంగా రైల్వే వంతెనపై పట్టాల పక్కన ఓ జంట రీల్ చేసి.. నెటిజన్ల చేత తిట్లు తిన్నారు. ఇందుకు సంబంధించిన (Viral video) వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

(railway bridge Couple filmed) వైరల్ వీడియో ప్రకారం.. నార్త్ ఇండియాకు చెందిన ఓ జంట ప్రమాదకరంగా ఓ రైల్వే వంతెనపై రీల్స్ చేశారు. వేగంగా వెళ్తున్న రైలు పక్కన వీడియో క్రియేట్ చేశారు. ఓవైపు వేగంగా వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. మరోవైపు వంతెన పట్టాల పక్కనే ఉన్న చిన్న ఇరుకు స్థలంలో డెంజరేస్‌గా నడుస్తూ రీల్ షూట్ చేస్తున్నారు. చిన్నగా కాలు జారినా, గట్టిగా గాలొచ్చినా.. వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అవేవి పట్టించుకోకుండా జంట ప్రమాదకరమైన స్టంట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజ‌న్లు జంటపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపులారిటీ కోసం మరీ ఇంత రిస్క్ అవసరమా? నెటిజన్లు మండిపడ్డారు. ఇలాంటి ప్రమాదకర రీల్స్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని రైల్వేశాఖకు ఈ జంట రీల్‌ను ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశారు. వైరల్ వీడియో ఇదే..

Next Story