ఈ ఇడ్లీ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. స్పెషాలిటీ ఏంటంటే?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-01-24 14:51:50  IST  )

సాధారణంగా ఒక ప్లేటు ఇడ్లీ ధర ఎంత ఉంటుంది?

ఈ ఇడ్లీ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. స్పెషాలిటీ ఏంటంటే?
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా ఒక ప్లేటు ఇడ్లీ ధర ఎంత ఉంటుంది? బండి మీద అయితే రూ.30-50 వరకు ఉంటుంది. అదే ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో అయితే కనీసం రూ.500 వరకు ఉంటుంది. కానీ, ఓ లగ్జరీయస్ ప్యాలెస్‌లో దొరికే ఇడ్లీకి ఏకంగా రూ.5 వేల రూపాయలు. అంతా స్పెషల్ ఏముంటుంది ఏమైనా బంగారంతో తయారు చేస్తారా.. అని అనుకుంటున్నారా? అవును నిజంగానే 23 క్యారెట్ల బంగారంతో చేసిన ఇడ్లీ ఇది. ప్రస్తుతం దీనిని సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఓ బెంగుళూరు వ్లాగర్ వీధుల్లో దొరికే ఇడ్లీ నుంచి విలాసవంతమైన హోటళ్ల వరకు ఇడ్లీలు టేస్ట్ చేసి రేటింగ్ ఇవ్వాలనుకున్నాడు. ఇందులో భాగంగా ముందుగా వీధులలో అమ్మే రూ.5ల ఇడ్లీని తినేందుకు సాదాసీదాగా వెళ్లి టేస్ట్ చేసి చూశాడు. రుచి అదుర్స్‌ అంటూ పదికి తొమ్మిదన్నర మార్కులు వేశాడు. ఆ తర్వాత ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లోని రూ.50ల ఇడ్లీని టేస్ట్ చేసి ఏడున్నర మార్కులు వేశాడు. అనంతరం తాజ్‌ హోటల్‌కు వెళ్లి ఇడ్లీ ఆర్డర్ చేశాడు. అక్కడ వారు దానిని చక్కగా ప్లేట్‌లో తీసుకురావడం తోపాటు నైఫ్‌, ఫోర్క్‌లు ఇచ్చారు. వాటితో ఇడ్లీని తినడం ఇబ్బందిగా అనిపించినా.. అలా తినక తప్పలేదు. అయితే తాజ్ హోటల్ ఇడ్లీకి కేవలం నాలుగున్నర మార్కులే వేశాడు.

ఇక చివరగా ఓ లగ్జరీయస్‌ ప్యాలెస్‌లో ఇడ్లీ తినడానికి వెళ్లాడు. అక్కడ ఇడ్లీ ఖరీదు ఏకంగా రూ.5 వేల రూపాయలు ఉంది. దానిని 23 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. అన్ని డబ్బులు వెచ్చించినా.. కొద్దిగా మాత్రమే తినగలిగాడు. ఇక తన వల్ల కాదంటూ.. రూ.5 ఇడ్లీనే చాలా టేస్ట్‌గా ఉందని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వటంతో.. రుచి అనేది రేంజ్‌ హోటల్‌ని బట్టికాదు..చేసే విధానం బట్టి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Next Story