- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ శోభాయాత్రలో వివాదం.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఫ్లెక్సీ కలకలం
హైదరాబాద్ హనుమాన్ జయంతి శోభాయాత్రలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఫ్లెక్సీ కలకలం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో అత్యంత వైభవంగా జరిగిన హనుమాన్ జయంతి (Hanuman Jayanti) శోభాయాత్రలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ప్రశాంత వాతావరణంలో సాగుతున్న ఊరేగింపులో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) ఫోటో ఉన్న ఫ్లెక్సీ దర్శనమివ్వడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే శోభాయాత్రలో పాల్గొన్న కొందరు యువకులు ఓ భారీ ఫ్లెక్సీని ప్రదర్శించారు. అందులో ఓ వైపు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫోటో ఉండగా.. మరోవైపు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ చిత్రం ఉంది. ఆ ఫ్లెక్సీపై హిందీలో ‘ఆప్ కా బాప్ ఆ రహా హై’ అనే హెచ్చరికతో కూడిన నినాదాన్ని రాశారు.
సోషల్ మీడియాలో వీడియోలు వైరల్..
ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్‌కి సంబంధించిన ఫ్లెక్సీల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్నాయి. ఆధ్యాత్మిక యాత్రల్లో ఇలాంటి వివాదాస్పద వ్యక్తుల ఫోటోలు ప్రదర్శించడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం జైలులో ఉన్నప్పటికీ, పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసు, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపుల కేసులతో నిరంతరం వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే..






