- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీక్స్‌కు చేరిన కానిస్టేబుల్ రీల్స్ పిచ్చి: సీఎం రేవంత్‌ను కల్పిస్తానని ఓవర్ యాక్షన్
నగరంలో ఓ కానిస్టేబుల్ రీల్స్ పిచ్చి పరాకాష్టకు చేరింది. సీఎం రేవంత్ రెడ్డిని కల్పిస్తానంటూ ఖాకీ డ్రెస్ వేసుకుని చేస్తున్న ఓవరాక్షన్‌తో నెటిజన్లు మండిపడుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఖాకీ డ్రెస్సు వేసుకుని బాధ్యతగా ఉండాల్సిన ఓ కానిస్టేబుల్ (Constable) ‘రీల్స్’ పిచ్చి పీక్స్‌కు చేరింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పేరును వాడుకుంటూ, ఆయన సెక్యూరిటీ విధుల్లో ఉండి ఇష్టారాజ్యంగా వీడియోలు చేస్తూ హల్ చేస్తున్నాడు. సిటీ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చరణ్ యాదవ్ తీరు ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి కారణమవుతోంది.
సీఎం రేవంత్ పేరుతో వివాదాస్పద రీల్..
సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న చరణ్ యాదవ్ (Charan Yadav), తాజాగా ఇన్‌స్టాగ్రామ్ (Instagram)లో ఓ రీల్ చేశాడు. అందులో ‘మీరు రేవంత్ రెడ్డిని కలవాలా..? అయితే నాకు మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి.. నేనే మీకు మీటింగ్ అరేంజ్ చేస్తా’ అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మాట్లాడాడు. అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిని కలిపించే అధికారం తనకున్నట్లుగా అతను బిల్డప్ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఐపీఎల్ సందర్భంగా ఎస్ఆర్‌హెచ్ (SRH)- చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మ్యాచ్ టికెట్లు ఇప్పిస్తానంటూ సోషల్ మీడియాలో రీల్స్ చేసి హంగామా చేశాడు. అదేవిధంగా పోలీస్ యూనిఫాంలో ఉండి కూడా అసభ్యకర భాష వాడుతూ వీడియోలు చేయడం ఇతనికి అలవాటుగా మారిందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది డిపార్ట్‌మెంట్ ప్రతిష్టను దెబ్బతీస్తోందని తోటి పోలీసులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
చర్యలు తీసుకోవాలని డిమాండ్
సాధారణంగా పోలీసులు సోషల్ మీడియా (Social Media) వాడకంపై ఉన్నతాధికారులు అనేక ఆంక్షలు విధిస్తుంటారు. కానీ, చరణ్ యాదవ్ వాటన్నింటినీ తుంగలో తొక్కి, ఏకంగా సీఎం కార్యాలయం పేరుతో ’బ్రోకరిజం’ తరహాలో మాట్లాడుతుండటంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘పోలీస్ డ్రెస్ వేసుకుని ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తుంటే డిపార్ట్‌మెంట్‌పై గౌరవం పోతుంది. వెంటనే ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ పలువురు నెటిజన్లు X, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా డీజీపీని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ట్యాగ్ చేస్తున్నారు. బాధ్యతాయుతమైన విధుల్లో ఉండి రీల్స్ పిచ్చితో వ్యవస్థను హేళన చేస్తున్న ఈ ‘రీల్స్ కానిస్టేబుల్’పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.






