ట్రైన్‌లో ఏసీ తక్కువ వస్తుందని ప్రయాణికుల కంప్లైంట్స్.. అందులో ఏముందో చూసి రైల్వే సిబ్బంది షాక్

by Ajay Maddhiboyina |

యూపీ నుండి బిహార్ వెళ్లే రైలులో ఏసీ సరిగ్గా రావడంలేదని ప్రయాణికులు ఫిర్యాదు చేయగా సిబ్బంది అందులో ఉన్నవాటిని చూసి షాక్ అయ్యారు.

ట్రైన్‌లో ఏసీ తక్కువ వస్తుందని ప్రయాణికుల కంప్లైంట్స్.. అందులో ఏముందో చూసి రైల్వే సిబ్బంది షాక్
X

దిశ, వెబ్ డెస్క్: యూపీ నుండి బిహార్ వెళ్లే రైలులో ఏసీ సరిగ్గా రావడంలేదని ప్రయాణికులు ఫిర్యాదు చేయగా సిబ్బంది అందులో ఉన్నవాటిని చూసి షాక్ అయ్యారు. లక్నో బరౌని ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ కోచ్‌లో ఉక్కపోతగా ఉండటంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ఏపీ పెంచినా చల్లగా లేకపోవడంతో రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అనేక ఫిర్యాదులు అందడంతో సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఏసీ ప్యానెల్ తెరిచి చూడగా అందులో మద్యం బాటిల్స్ బయటపడ్డాయి. జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మద్యం బాటిళ్లను ఏసీలో దాచిపెట్టారు. దీంతో రైల్వే పోలీసులు రంగంలోకి దిగి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇంకా ఎక్కడైనా మద్యం బాటిల్స్ ఉన్నాయా అని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బీహార్‌లో కఠినమైన మద్య నిషేధ చట్టాలు అమలులో ఉన్నాయి. 2016 నుండి ఆ రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై పూర్తి నిషేధం విధించారు. ఎవరైన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఎవరికీ పట్టుబడకుండా ఉండేందుకు కేటుగాళ్లు మద్యం బాటిళ్లను ఏకంగా ఏసీలోనే దాచిపెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఓ నెటిజన్ రైళ్లలోని ఏసీ కోచ్ లలో ఫ్రిజ్‌లను పెట్టండి లేదంటే ఏసీలన్నీ మద్యంతో నిండిపోతాయి అని పేర్కొన్నారు. మరో నెటిజన్ వావ్.. ఎంత తెలివిగా పెట్టార్రా అంటూ కామెంట్ చేశాడు.

Next Story