- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral Video : పబ్లిక్‌లో అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్.. కాలర్ పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు లాక్కెళ్లిన అమ్మాయి..
ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో ఉన్న గోల్ చౌరాహాలోని జీటీ రోడ్ సమీపంలో స్టాంప్ పేపర్ కొనేందుకు వచ్చింది ఓ అమ్మాయి. అయితే అప్పుడే పోలీస్ రెస్పాన్స్ వెహికిల్ దిగొచ్చిన కానిస్టేబుల్ బ్రజేష్..

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో ఉన్న గోల్ చౌరాహాలోని జీటీ రోడ్ సమీపంలో స్టాంప్ పేపర్ కొనేందుకు వచ్చింది ఓ అమ్మాయి. అయితే అప్పుడే పోలీస్ రెస్పాన్స్ వెహికిల్ దిగొచ్చిన కానిస్టేబుల్ బ్రజేష్.. ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. చేతులు లాగుతూ, సైగల్ చేస్తూ సెక్సువల్‌గా హరాజ్ చేశాడు. దీంతో ఆగ్రహంతో అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయిన అమ్మాయి.. తన సోదరి, తల్లికి విషయాన్ని వివరించింది. దీంతో ముగ్గురు మళ్లీ ఆ చోటుకు వెళ్లగా.. అక్కడే తిరుగుతూ కనిపించాడు కానిస్టేబుల్.
వెంటనే ముగ్గురు కలిసి అతన్ని ఫోన్‌తో క్యాప్చర్ చేసేందుకు ప్రయత్నించగా.. ఫోన్ లాక్కున్నాడు. చేతిపై కొట్టాడు. దీంతో చిర్రెత్తిపోయిన అమ్మాయి.. కాలర్ పట్టుకుని రోడ్డుపై లాక్కెళ్లింది. ఆమె సోదరి మధ్యలో పోలీస్ ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేయగా వచ్చిన మరో పోలీసు.. అతన్ని దగ్గర్లో ఉన్న కాకాదేవో పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆ అమ్మాయి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. జనాలను రక్షించాల్సిన పోలీసులు ఇలా చేయడం సిగ్గుచేటని తిట్టిపోస్తున్నారు. కానిస్టేబుల్‌పై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్నారు.






