మోడీ చీర ఎఫెక్ట్.. కాంగ్రెస్ లీడర్‌కు రూ.5 వేల చీర కట్టిన బీజేపీ కార్యకర్తలు

by Sujitha Rachapalli |

మహారాష్ట్ర డొంబివలిలో జరిగిన ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది. సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తకు బీజేపీ కార్యకర్తలు చీరకట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఫైర్ అవుతుంటే..

మోడీ చీర ఎఫెక్ట్.. కాంగ్రెస్ లీడర్‌కు రూ.5 వేల చీర కట్టిన బీజేపీ కార్యకర్తలు
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర డొంబివలిలో జరిగిన ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది. సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తకు బీజేపీ కార్యకర్తలు చీరకట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఫైర్ అవుతుంటే.. బీజేపీ నాయకులు మాత్రం ప్రతీకారంగా సమర్థించుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. ఉల్హాస్‌నగర్‌కు చెందిన ప్రకాశ్ పగరే(73) ఫేస్‌బుక్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎరుపు రంగు చీరకట్టుకున్నట్లు మార్ఫింగ్ చేసిన ఫొటో పోస్ట్ చేశాడు. దీన్ని బీజేపీ లీడర్స్ అవమానంగా భావించి.. అతను ఆస్పత్రి నుంచి బయటకు వస్తుండగా పట్టుకున్నారు. బలవంతంగా ఐదు వేల రూపాయల విలువైన ఎర్ర చీరను కట్టి అవమానించారు. నీరసంగా ఉండటంతో ఎదిరించలేని పగరే.. నిరసన వ్యక్తం చేశాడు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో రాజకీయంగా దుమారం రేగింది. దీనికి ఎస్సీ, ఎస్టీలకు జరిగిన అవమానంగా భావించి కులం రంగు పులిమే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Next Story