- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Limca book record: జిల్లా కలెక్టర్ అరుదైన రికార్డు.. లిమ్కా బుక్‌లో చోటు.. ఎందుకంటే?
ఏ ప్రభుత్వ ఉద్యోగికి అయినా ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లు సర్వసాధారణం.

దిశ, వెబ్ డెస్క్: ఏ ప్రభుత్వ ఉద్యోగికి అయినా ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లు సర్వసాధారణం. ఆయా ఉద్యోగి సర్వీసును బట్టి ప్రమోషన్, బదిలీ ఉంటుంది. ఇక IAS అధికారులు సాధారణంగా రెండేళ్లకు ఒకసారి బదిలీ అవుతుంటారు. అయితే, 15 ఏళ్ల సర్వీసులో ఏకంగా 14 సార్లు ట్రాన్స్‌ఫర్లు పొంది ఓ జిల్లా కలెక్టర్ రికార్డు క్రియేట్ చేశాడు. అదేంటి 15 ఏళ్ల సర్వీసులో 14 సార్లు బదిలీ అవ్వటం అని ఆశ్చర్యపోతున్నారా? మరీ ఆ సంగతేంటో తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన అమిత్ కుమార్ గుప్తా 2000లో సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించి ఉత్తర్‌ప్రదేశ్‌కు (Uttarpradesh) కేడర్‌కు ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. తొలుత మేరఠ్ అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆగ్రాలో జాయింట్ మేజిస్ట్రేట్‌గా పనిచేశారు. అనంతరం అమిత్ గుప్తా మొదటిసారి 2005లో హమీర్‌పుర్‌కు జిల్లా మేజిస్ట్రేట్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత లలిత్‌పుర్ కలెక్టర్‌గా కేవలం 8 రోజులు సేవలందించారు. అమిత్ కెరీర్ ఎక్కువ కాలం బదౌన్ జిల్లాలోనే కలెక్టర్‌గా పనిచేసింది. అక్కడ రెండున్నరేళ్లు పనిచేశారు.
ఇలా నిత్యం ట్రాన్స్‌ఫర్లతో తన 15 ఏళ్ల సర్వీసులో అమిత్ ఏకంగా 14 సార్లు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో 2015లో ఎక్కువ జిల్లాల్లో(14) మేజిస్ట్రేట్‌గా పనిచేసినందుకు ఆయన పేరు లిమ్కా బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్‌లో (Limca Book of National Records) నమోదైంది. అమిత్ గుప్తా ఇప్పటివరకు ఆగ్రా, హమీర్పుర్, లలిత్‌పుర్, కన్నౌజ్, జలౌన్, ఫిరోజాబాద్, ప్రతాప్‌గఢ్, మహరాజ్ గంజ్, ఇటావా, బదౌన్, ఫిలీబిత్, బిజ్నౌర్, శ్రావస్తి, లఖింపుర్ ఖేరీ జిల్లాల్లో కలెక్టర్‌గా పనిచేశారు.
అయితే, సోమవారం రాత్రి యూపీ సర్కార్ 33 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇందులో భాగంగా ప్రస్తుతం స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న అమిత్ గుప్తాకు రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. గతంలో యూపీ ప్రభుత్వంలో సాంకేతిక విద్య, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, వైద్య విద్య కార్యదర్శి, సీఎం ప్రత్యేక కార్యదర్శిగా కూడా అమిత్ సేవలందించారు.






