Shocking video: ఎలుక అనుకుని తనపై తానే దాడి చేసుకున్న నాగుపాము.. వీడియో వైరల్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-03 12:50:02  IST  )

మనలో చాలా మంది పాములంటే (Snakes) చచ్చేంత భయపడుతారు.

Shocking video: ఎలుక అనుకుని తనపై తానే దాడి చేసుకున్న నాగుపాము.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: మనలో చాలా మంది పాములంటే (Snakes) చచ్చేంత భయపడుతారు. అవి కనిపిస్తే ఆమడ దూరం పరుగెత్తుతాం. భూమిపై ఎన్నో రకాల జాతి పాములు ఉన్నాయి. అందులో కొన్ని అత్యంత విషపూరితమైనవి కాగా, మరికొన్ని విషపూరితమైనవి, ఇంకొన్ని విషరహితమైనవి ఉంటాయి. ఇక తమ పరిసరాల్లో ఏదైనా అలజడిని గమనిస్తే వెంటనే అప్రమత్తమవుతాయి. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాయి. లేదంటే ఎగబడి కాటేస్తాయి. కానీ, ఓ పాము తనపై తానే దాడి చేసుకోవటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరీ అలా ఎందుకు దాడి చేసుకుంటుందో తెలుసుకోవాలంటే.. ఈ వార్తను చదివేయండి.

ప్రపంచంలోని చాలా దేశాల్లో పాములపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయనే సంగతి తెలిసిందే. ఇందుకోసం పాములను చిన్నప్పుడే బంధించి తీసుకొచ్చి రీసెర్చ్ సెంటర్లలో (Research Centers) పెంచుతుంటారు. తాజాగా ఓ రీసెర్చ్ సెంటర్లో పెంచుతున్న వైట్ కలర్ కింగ్ కోబ్రాకు (White colored king cobra) సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కింగ్ కోబ్రాకు ఆహారంగా ఎలుకను (Rat) వేశారు. అయితే, ఎలుక తెలివిగా పాము దానిపై దాడి చేసే క్రమంలో పక్కకు జరిగి తప్పించుకుంది. దీంతో ఆ పాము.. దాని తోకపై అదే కాటు వేసుకుంది. అలాగే, పాము, ఎలుక రెండు ఒకే రంగులో ఉండటంతో పాము తనకు తానే దాడి చేసుకోవడం ప్రారంభించింది. ఈ వీడియో చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.

Next Story