Caught On Camera: స్కూల్‌పై నుంచి దూకి 6వ తరగతి విద్యార్థిని మృతి

by Ramesh Naini |   (  Updated:2025-11-02 09:32:48  IST  )

రాజస్థాన్ రాజధానిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

Caught On Camera: స్కూల్‌పై నుంచి దూకి 6వ తరగతి విద్యార్థిని మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజస్థాన్ రాజధానిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జైపూర్ లోని నీర్జా మోడీ స్కూల్ ఐదో అంతస్తు నుంచి దూకి 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని అమైరా (12) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ విషాద సంఘటన తల్లిదండ్రులు, స్థానికులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. పాఠశాల ఆవరణలో పిల్లల భద్రత, పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తారు.

ఘటన జరిగి పోలీసులు వచ్చేలోపు పాఠశాల సిబ్బంది ఆ ప్రాంతాన్ని, రక్తపు మరకలను శుభ్రం చేయడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా మందలించడంతో అమైరా ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పుకార్లు వినిపించాయి.స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకుని, CCTV ఫుటేజ్‌ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది.

సీసీటీవీలో రికార్డైన ఘటన..

బాలిక రెయిలింగ్ పైకి ఎక్కి, ఆపై 47 అడుగుల ఎత్తు నుండి దూకినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో వెల్లడైందని పోలీసు అధికారులు తెలిపారు. సమీపంలోని ఇతర విద్యార్థులు ఏమి జరుగుతుందో తెలియక సాధారణంగా నడుస్తున్నట్లు కనిపించారని వెల్లడించారు. విద్యార్థిని కింద పడిన వెంటనే టీచర్లు, సిబ్బంది సహాయం కోసం అక్కడికి వచ్చారు. ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె చనిపోయిందని నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఆత్మహత్య అని సూచిస్తున్నాయి, కానీ ఆమె చర్య వెనుక ఉన్న ఖచ్చితమైన కారణం ఇంకా తెలియదని, దానిపై దర్యాప్తు చేపట్టినట్లు మానసరోవర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ లఖన్ ఖతానా తెలిపారు. వీడియో ఇదే..

Next Story