ఏడడుగులు వేసే ముందు అదనపు కట్నం డిమాండ్.. సినిమాటిక్ క్లైమాక్స్‌.. అతనండి అసలు హీరో

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ బరాబంకి జిల్లాలో జరిగిన పెళ్లి.. సినిమాటిక్ ట్విస్ట్‌తో శుభం అనిపించుకుంది. కస్బాలోని ఉత్తర్ టోలా ఏరియాలో సెప్టెంబర్ 24న ఈ వివాహం జరిగింది. వధువు సోనీకి సమీప గ్రామానికి చెందిన అబ్బాయితో పెళ్లి నిశ్చయమైంది. ఆచార, సంప్రదాయాలన్నీ పూర్తయ్యాయి.

ఏడడుగులు వేసే ముందు అదనపు కట్నం డిమాండ్.. సినిమాటిక్ క్లైమాక్స్‌.. అతనండి అసలు హీరో
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ బరాబంకి జిల్లాలో జరిగిన పెళ్లి.. సినిమాటిక్ ట్విస్ట్‌తో శుభం అనిపించుకుంది. కస్బాలోని ఉత్తర్ టోలా ఏరియాలో సెప్టెంబర్ 24న ఈ వివాహం జరిగింది. వధువు సోనీకి సమీప గ్రామానికి చెందిన అబ్బాయితో పెళ్లి నిశ్చయమైంది. ఆచార, సంప్రదాయాలన్నీ పూర్తయ్యాయి. ఇక ఏడడుగులు వేసే సమయంలో వరుడి కుటుంబం అదనంగా లక్షన్నర నగదు, తులం బంగారం కట్నం కింద ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీన్ని వధువు అవమానంగా భావించి.. పెళ్లి వద్దని చెప్పింది. ఆమె కుటుంబం కూడా ఇందుకు మద్దతు ఇచ్చింది. అక్కడితో ఈ ఇద్దరి మధ్య జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది.

అయితే వధువు తన సోదరి మరిదిని తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. దీంతో శివాన్ష్ ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా మండపంలోకి ఎంటర్ అయ్యాడు. ఆమెకు సింధూరం దిద్దాడు. దీంతో అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న పెళ్లి మండపం హర్షధ్వానాలతో నిండిపోయింది. అతిథులంతా ప్రశంసల వర్షం కురిపించారు. కానీ ఇంతకు ముందు పెళ్లి చేసుకుందామనుకున్న వరుడి కుటుంబం దీన్ని అవమానకరంగా భావించి గొడవకు దిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కానీ అంతలోనే ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. గొడవను సద్దుమణిచారు. శివాన్ష్‌ను విచారించి.. వదిలేశారు.

Next Story