Viral : పెళ్లీ పెటాకులు వద్దు బాబోయ్.. ఉద్యోగం, ఆస్తులు అన్నీ వదిలేసి గుహలో ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తి !

by Javid Pasha |   (  Updated:2025-06-17 06:21:02  IST  )

Viral : పెళ్లీ పెటాకులు వద్దు బాబోయ్.. ఉద్యోగం, ఆస్తులు అన్నీ వదిలేసి గుహలో ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తి !

Viral : పెళ్లీ పెటాకులు వద్దు బాబోయ్.. ఉద్యోగం, ఆస్తులు అన్నీ వదిలేసి గుహలో ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తి !
X

దిశ, ఫీచర్స్ : పెళ్లి చేసుకోవాలని, ఇల్లు కట్టుకోవాలని, కుటుంబంతో సంతోషంగా జీవించాలని ప్రతీ ఒక్కరు కలలు గంటారు. ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం రావాలని కూడా కోరుకుంటారు. అందుకోసం ప్రయత్నం చేస్తుంటారు. ఇక మంచి ఉద్యోగం దొరికిందంటే అస్సలు వదులుకోరు కొందరు. కానీ అక్కడక్కడా ఇందుకు భిన్నంగా ఆలోచించే వారు కూడా ఉంటారు. ఆ కోవకే చెందుతాడు చైనాకు చెందిన మిన్ హెంగ్కాయ్(Min Hengkai). జీవితంలో పెళ్లి చేసుకోవడమంత టైమ్ వేస్ట్ పని మరొకటి లేదంటున్న ఇతను ఇల్లు, ఆస్తి, వదిలేసి గుహలో ఒంటరిగా జీవిస్తున్నాడు. ఎందుకంటే..

నిజానికి మిన్ హెంగ్కాయ్ గతంలో ఒక ఉద్యోగి. ఈ -హైలింగ్ డ్రైవర్‌గా నెలకు 10,000 యువాన్‌లు సంపాదించేవాడు. అయితే ఇందులో ఎక్కువ భాగం అప్పులు తీర్చడానికే సరిపోయేదట. అలాంటప్పుడు ఎవరైనా ఇంకా ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తారు. కానీ మిన్ మాత్రం అసలు ఉద్యోగమే వద్దంటూ వదిలేశాడు. అంతేకాకుండా తనకు ఉన్న ఆస్తులను సైతం అమ్మేసి బ్యాంకు రుణాలు, ఇతర అప్పులు తీర్చేసి మిగిలింది బంధువులకు ఇచ్చేసిన అతను ఒంటరిగా, ప్రశాంతంగా జీవించాలని నిర్ణయించుకున్నాడు.

ప్రస్తుతం మిన్ తన జీవన శైలిని పూర్తిగా మార్చేసుకున్నాడు. తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులను, వివాహ జీవితాన్ని వదిలేసి ఒక కొండ గుహలో ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. ఏ విషయంలోనూ ఇతరులపై ఆధారపడకూడదని తనే స్వయంగా పండించిన కూరగాయలతో, వాటిపై వచ్చే ఆదాయంతో సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు. అతడు విలాసాలకోసం ఆరాట పడడు. కేవలం అవసరమైన వస్తువుల కోసం మాత్రమే డబ్బు ఖర్చు చేస్తాడు. ఇలా జీవించడమే తనకు ఆనందంగా ఉందని, జీవితంలో పెళ్లి, సంపాదన, కుటుంబం, ఉద్యోగం వంటివి తనకు సంతోషాన్ని ఇవ్వలేదని, తన దృష్టిలో అవన్నీ టైమ్ వేస్ట్ చర్యలేనని చెబుతున్నాడు మిన్ హెంగ్కాయ్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Instagram link

Next Story