- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral News : పాపం అని డబ్బులు దానం చేస్తే.. జైలుకి వెళ్లాల్సి వచ్చింది
పుణ్యం కోసం వెళితే పాపం ఎదురైనట్టు.. పాపం అని ఒక రూపాయి దానం చేసినందుకు జైలులో చిప్పకూడు తినాల్సిన పరిస్థితి ఎదురైంది ఓ వ్యక్తికి.

దిశ, వెబ్ డెస్క్ : పుణ్యం కోసం వెళితే పాపం ఎదురైనట్టు.. పాపం అని ఒక రూపాయి దానం చేసినందుకు జైలులో చిప్పకూడు తినాల్సిన పరిస్థితి ఎదురైంది ఓ వ్యక్తికి. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్(MP) లోని ఇండోర్(Indore) లో భిక్షాటనను బ్యాన్ (Begging Ban) చేశారు అక్కడి అధికారులు. యాచకులకు దానం(Donation) చేయడం నేరం కింద పరిగణిస్తారు. అయితే తాజాగా ఓ వ్యక్తి గుడి బయట ఈ బిక్షగత్తెకు డబ్బులు ఇస్తుండగా.. పోలీసులు గమనించి అతనిపై కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్(BNS Act) ప్రకారం అతనికి జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని పోలీసులు తెలియ జేశారు. కాగా బిక్షాటన లేని నగరాలుగా తీర్చిదిద్దడానికి దేశంలో 10 నగరాలను పైలట్ ప్రాజెక్టులుగా చేపట్టింది. వాటిలో ఇండోర్, డిల్లీ, బెంగళూర్, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలు ఉన్నాయి. ఇందులో భాగంగా భిక్షాటన చేసినా.. భిక్షం వేసినా నేరమే. ఈ విషయం తెలియని వ్యక్తి యాచకురాలికి దానం చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. అయితే ఈ వార్తా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.






