- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెడిసికొట్టిన కారు స్టంట్లు.. కారులో చెలరేగిన మంటలు
కారు స్టంట్లు బెడిసికొట్టిన నేపథ్యంలో మంటలు చెలరేగిన సంఘటన అస్సాంలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న కూడా ఈ ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. యువత అతివేగం, మద్యం తాగి నడపడం లాంటి తదితర సంఘటనల నేపథ్యంలో విషాద కర సంఘటనలు జరుగుతున్నాయి. అయితే లేటెస్ట్ గా కొంత మంది యువకులు కారుతో స్టంట్లు చేయగా బెడిసికొట్టిన సంఘటన అస్సాంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
అస్సాంలోని గోలాఘాట్ లో ఓ వివాహ కార్య క్రమం జరిగింది. ఈ క్రమంలో ఈ పెళ్లికి వచ్చిన కొందరు యువకులు పీకలదాకా తాగి, కారు డ్రైవ్ చేశారు. కారుతో స్టంట్లు కూడా చేశారు. దీంతో అదుపు తప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది కారు. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక ఈ సంఘటన జరిగిన వెంటనే స్థానికులు అలర్ట్ అయ్యారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు. అటు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.






