‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో కారు డిజైన్.. సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ ఫోటోలు సైతం

by Ramesh Naini |

జమ్మూకాశ్మీర్‌లో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో భారత్ భారీ ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే.

‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో కారు డిజైన్.. సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ ఫోటోలు సైతం
X

దిశ, డైనమిక్ బ్యూరో: జమ్మూకాశ్మీర్‌లో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా (Operation Sindoor) ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో భారత్ భారీ ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్తాన్, పీవోకేలో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు ఎయిర్‌స్ట్రైక్స్ చేశాయి. ఈ దాడిలో దాదాపు వందకు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ సింధూర్‌ సక్సెస్ అయింది. దీంతో దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆపరేషన్ సింధూర్‌పై ప్రజలు ప్రశంసలు తెలియజేస్తున్నారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలపై ఎప్పటికప్పుడు ప్రజలకు వివరాలను అందించిన అధికారులు కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లు సైతం దేశప్రజల ప్రశంసలు అందుకున్నారు. ప్రజలు వారికి బ్రహ్మరథం పట్టారు.

ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి తన దేశభక్తిని చాటుతూ ఆపరేషన్ సింధూర్ పేరుతో కారు డిజైన్ చేయించుకున్నారు. (Mahindra Thar) మహీంద్రా థార్‌ నలుపు రంగు కారుకు ఆపరేషన్ సింధూర్ స్టిక్కరింగ్ చేయించారు. ముందు భాగంలో పేరు.. రెండు డోర్లకు ఓవైపు కల్నల్ సోఫియా కురేషీ (Colonel Sophia Qureshi), మరోవైపు వ్యోమికా సింగ్ (Wing Commander Vyomika Singh) అధికారుల ఫోటోలు ఉన్నాయి. అదేవిధంగా ఫైటర్ జెట్స్, ఆర్మీ జవాన్ల (Fighter jet) ఫోటోలు సైతం కారుకు స్టిక్కరింగ్ చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో కార్ డిజైన్ చేసిన దేశ భక్తుడు.. అంటూ ఈ వీడియోను ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. ఈ స్టిక్కరింగ్ చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. కాగా, భారత్-పాక్ మధ్య తాజాగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే పాకిస్తాన్ మాత్రం కాల్పుల విరమణను తుంగలో తొక్కుతోంది. ఇందుకు భారత్ దిమ్మతిరిగే సమాధానం ఇస్తోంది.

Next Story