విజయోత్సవ పరేడ్‌లో కారు బీభత్సం.. హాహాకారాలుగా మారిన ఆనందాలు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-27 11:44:59  IST  )

విజయోత్సవంలో అంతా ఎంతో ఆనందంగా ఉండగా ఉహించని ఘటన చోటుచేసుకుంది.

విజయోత్సవ పరేడ్‌లో కారు బీభత్సం.. హాహాకారాలుగా మారిన ఆనందాలు
X

దిశ, వెబ్ డెస్క్: విజయోత్సవంలో అంతా ఎంతో ఆనందంగా ఉండగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. సంతోషమైన కేరింతలు కాస్తా.. ఒక్కసారిగా హాహాకారాలుగా మారిపోయాయి. ఇంగ్లాండ్‌లోని (England) లివర్‌పూల్ (Liverpool) నగరంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. అసలేం జరిగిందంటే?

ప్రీమియర్‌ లీగ్‌లో 20వ టైటిల్‌ను లివర్‌పూల్‌ ఫుట్‌బాల్‌ (Football) క్లబ్ సొంతం చేసుకుంది. దీంతో మాంచెస్టర్ యునైటెడ్ జట్టుతో సమంగా నిలిచింది. ఈ సందర్భంగా ఆ జట్టు ఈ విక్టరీ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా అభిమానులకు అభివాదం చేస్తూ లివర్‌పూల్ టీమ్‌ పరేడ్‌ నిర్వహించింది. ఈ సంబరాల నడుమ ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన కారుతో వేగంగా వేడుక జరుగుతున్న ప్రదేశంలోకి దూసుకొచ్చాడు. విచక్షణారహితంగా పలువురిని ఢీకొట్టుకుంటూ ముందుకెళ్లాడు. ఈ ఘటనలో 27 మందికి గాయాలయ్యాయి. నలుగురు చిన్నారుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు.

కాగా లివర్‌పూల్ జట్టు విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ సందడి, కొద్దిసేపటికి హడావుడిగా మారింది.ఈ దాడి ఉద్దేశపూర్వకమా లేక ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అభిమానుల ఆనందాన్ని మలుపుతిప్పిన ఈ ఘటన ఇప్పుడు అక్కడ పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story