పెట్రోల్ బంక్ లో కారు బీభత్సం... వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే !

by velandi.Saikiran |

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వస్తూ ఉంటాయి. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే.. మరికొన్ని కాస్త భయానకంగా

పెట్రోల్ బంక్ లో కారు బీభత్సం... వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే !
X

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వస్తూ ఉంటాయి. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే.. మరికొన్ని కాస్త భయానకంగా ఉంటాయి. ఆ వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే తాజాగా ఓ కారు (CAR) చేసిన బీభత్సం... అందరికీ నవ్వు తెప్పిస్తుంది. కారు డ్రైవర్ చేసిన చిన్న తప్పిదం కారణంగా పెట్రోల్ బంక్ లో ( Petrol Bunk) ఒక్కసారిగా మంటలు చెలరేగడమే కాకుండా... అక్కడ ఉన్న వాహనదారులు కూడా పరుగో పరుగు అంటూ బైక్స్ వదిలేసి కూడా వెళ్ళిపోయారు.

ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వాస్తవానికి ఈ కారు సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుంది. ఓ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకునేందుకు కారు వచ్చింది. ఈ నేపథ్యంలో బంకుకు సంబంధించిన వ్యక్తి.. కారు ట్యాంకర్ లో పెట్రోల్ గన్ పెట్టాడు. అయితే పెట్రోలు పోసిన తర్వాత... ఆ గన్ తీయకముందే... కారు ముందుకు వెళ్ళింది.

దింతో ఆ పెట్రోల్ గన్ తెగిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు డ్రైవర్ పారిపోయాడు. అక్కడే ఉన్న ఉన్న వాహనదారులు తమ బైక్స్ వదిలేసి పారిపోయారు. కొంతమంది మళ్ళీ వచ్చి తమ బైక్లను తీసుకునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో జనాలు చూసి షాక్ అవుతున్నారు. కొంతమంది పగలబడి నవ్వుకుంటున్నారు. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.


Next Story