- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారతీయుల మర్యాదలపై కెనడియన్ షాకింగ్ వ్యాఖ్యలు.. నెట్టింట సంస్కారంపై తీవ్ర చర్చ!
భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను విదేశీయులు ఎంతగానో మెచ్చుకుంటారు.

దిశ, వెబ్ డెస్క్: భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను విదేశీయులు ఎంతగానో మెచ్చుకుంటారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో భారతీయుల మర్యాదపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఇందుకు కారణంగా ఓ కెనడియన్ (Canadian) వ్యక్తి చేసిన వివాదస్పద వ్యాఖ్యలు. భారతదేశంలో ప్రజలు అంత మర్యాదగా ఉండరని, వారు మరింత మర్యాదగా ప్రవర్తించటం నేర్చుకోవాలంటూ ఓ వీడియోను నెట్టింట షేర్ చేశాడు. ఈ వీడియో నెట్టింట క్షణాల్లో వైరల్ అవ్వటంతో నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కొందరు అతనితో ఏకీభవిస్తుండగా.. మరికొందరు తీవ్రంగా విభేదించారు. దీంతో ప్రస్తుతం ఈ అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
కెనడాకు (Canada) చెందిన కాలేబ్ ఫ్రైసెన్ అనే యువకుడు తాజాగా తన సోషల్ మీడియాలో 'పొలైట్ ఇండియా ఛాలెంజ్ (#Polite India Challenge)' అంటూ ఓ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో మాట్లాడుతూ భారతీయులు రోజువారీ అపరిచితుల సంభాషణల్లో మర్యాద లోపించిందని అన్నాడు. మర్యాదగా ఉండటం కష్టమైన పని కాదని, సాధారణ చర్యల ద్వారా దీనిని సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, మెరుగైన ప్రవర్తన కోసం ఐదు చిట్కాలను అందించాడు. అవి ఏంటంటే.. 'మీరు అవసరం లేకపోయినా ఎవరికైనా థ్యాంక్యూ చెప్పండి. అవసరం లేకపోయినా ఎవరికైనా ప్లీజ్ చేయండి, అనవసరంగా ఎవరికైనా టిప్ ఇవ్వండి, మీ వెనుక వచ్చే వారి కోసం తలుపును తెరిచిపట్టుకోండి, ఎవరినైనా అడ్డుకోబోయే ముందు మిమ్మల్ని మీరు అదుపుచేసుకోండి' అంటూ సలహాలు ఇచ్చాడు. ఇక ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన వారు తమ అనుభవాలను తనతో పంచుకోవాలని ఫ్రైసెన్ ఆహ్వానించాడు.
ఇక ఇది సోషల్ మీడియాలో మర్యాద, సామాజిక ప్రవర్తనపై కొత్త చర్చకు దారితీసింది. అలాగే విభిన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. 'భారతదేశం ఎల్లప్పుడూ అతిథుల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటుంది' అంటూ, 'సాధారణంగా భారతీయులు మొదట్లో మర్యాదగా ఉండకపోవచ్చు, కానీ కచ్చితంగా ఆప్యాయంగా, ఆతిథ్యం ఇస్తారు' అని కొందరు, 'కెనడాకు తిరిగి వెళ్లు.. అక్కడ సామాజిక ప్రవర్తన స్థాయి ప్రపంచంలో దిగువస్థాయికి పడిపోయింది' అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.






