- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీళ్లను గుర్తుపట్టగలరా? చిన్న పిల్లలుగా మారిన నాయకులు.. ఇప్పుడు ట్రెండ్ ఇదే!
'వావ్, సో క్యూట్.. ఎంత ముద్దుగా ఉందో!'.. ఇప్పుడు ఈ మాట ఎవరిని చూసినా అంటున్నారు. అందుకు కారణం.. ఏఐ కొత్త మ్యాజిక్.

దిశ, వెబ్ డెస్క్: 'వావ్, సో క్యూట్.. ఎంత ముద్దుగా ఉందో!'.. ఇప్పుడు ఈ మాట ఎవరిని చూసినా అంటున్నారు. అందుకు కారణం.. ఏఐ (Artificial Intelligence) కొత్త మ్యాజిక్. ఏంటని ఆలోచిస్తున్నారా? గత కొన్ని రోజుల క్రితం వరకూ జీబ్లీ (Ghibli) స్టైల్ తెగ వైరలైంది. ప్రతి ఒక్కరు చాట్ జీపీటీ (ChatGPT) సాయంతో తమ ఫొటోలను జీబ్లీ ట్రెండ్‌లో మార్చుకుని మురిసిపోయారు. ఇప్పుడు ఆ ట్రెండ్ పాతదైపోయింది. ఆ స్థానాన్ని ఈ 'ఏఐ జనరేటెడ్ క్యూట్ బేబీ వీడియో (AI generated cute baby video)'లు కబ్జా చేశాయి. చిన్నారుల్లా మారిన రాజకీయ నాయకులు, సినీ తారలు, ఇతర ప్రముఖుల వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ముసలివాళ్లను కూడా పసిపిల్లలుగా మారుస్తూ.. నెట్టింట నవ్వులు పూయిస్తోంది ఈ ఏఐ మాయాజాలం. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో ప్రధాని మోడీ (PM Modi) సహ పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు చిన్నపిలల్లుగా ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్నారు.
ఏదైనా కొత్త ట్రెండ్ వచ్చిందంటే చాలు.. ఫ్యాన్స్ తమ ఫేవరేట్ వ్యక్తులను తమకు నచ్చినట్లుగా మార్చుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంబరపడిపోతుంటారు. ఈ క్రమంలో మన రాజకీయ నాయకులు చిన్నపిల్లలుగా మారి పార్లమెంట్‌లో ప్రసంగిస్తుంటే ఎలా ఉంటుందో చూడాలనుకున్నట్లున్నారు. వెంటనే ఏఐ సాయంతో ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీతో సహా ఇతర ముఖ్య నేతలు పసి పిల్లల్లా మారి లోక్‌సభలో ప్రసంగిస్తున్నట్లుగా ఉండే బేబీ రాజకీయ నాయకుల వీడియోను క్రియేట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది.
ఎలా క్రియేట్ చేస్తున్నారంటే?
ఈ ముద్దులొలికే బుజ్జాయి వీడియోలు తయారు చేయడం అంత కష్టం కాదు. కొన్ని నిమిషాల్లోనే మీ ముఖాన్ని చిన్నారిగా మార్చేసి వీడియోగా మార్చవచ్చు.
* చాట్‌జీపీటీ లేదా ఇతర ఏఐ టూల్స్ ఉపయోగించి పిల్లాడిలా కనిపించే ఫొటో క్రియేట్ చేయాలి.
* వీడియో రూపంలో కావాలంటే ఫొటోను అప్‌లోడ్ చేసి సరైన ప్రాంప్ట్ ఇవ్వాలి.
* ఏఐ టూల్ ఆ ఫొటోను చిన్నారి ముఖంలోకి మార్చి వీడియోగా మార్చుతుంది.
* మరీ వెంటనే మీరు కూడా ఈ ట్రెండ్ ట్రై చేయండి?
చివరగా.. ఈ ట్రెండ్ ఎంత బాగున్నా.. దాన్ని బాధ్యతగా వాడే అవసరం ఉంది. ఎందుకంటే.. ఎవరైనా వ్యక్తి అనుమతి లేకుండా చిన్నపిల్లల వీడియోగా మార్చడం, హాస్యాస్పదంగా ప్రచారం చేయడం మానవీయతకూ, గౌరవానికీ విరుద్ధం. వినోదం ఎప్పుడు పరిమితుల్లోనే ఉండాలి.






