పెళ్లింట విషాదం..కారు ఢీకొట్టడంతో గాల్లోకి ఎగిరి పడ్డ ఫోటోగ్రాఫ‌ర్‌!

by velandi.Saikiran |

ఫోటోల కోసం రోడ్డు ఎక్కితే.. ఆ ఫోటోగ్రాఫర్ ను వేగంతో వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ సంఘటన హర్యానాలో చోటు చేసుకుంది.

పెళ్లింట విషాదం..కారు ఢీకొట్టడంతో గాల్లోకి ఎగిరి పడ్డ ఫోటోగ్రాఫ‌ర్‌!
X

దిశ‌, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ యాక్సిడెంట్లు తగ్గడం లేదు. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం లాంటి సంఘటనల నేపథ్యంలో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే లేటెస్ట్ గా ఓ పెళ్లి వేడుకలో ఫోటోగ్రాఫర్ అత్యుత్సాహం, అతడి ప్రాణం తీసింది. ఫోటోల కోసం రోడ్డు ఎక్కితే.. ఆ ఫోటోగ్రాఫర్ ను వేగంతో వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ సంఘటన హర్యానాలో చోటు చేసుకుంది.

హర్యానాలో పెను విషాదం

హర్యానాలోని సిర్సా ప్రాంతంలో ఓ ఇంట్లో పెళ్లి వేడుక జరిగింది. ఇక పెళ్లి కార్యక్రమం ముగిసిన తర్వాత నూతన వధూవరులు కలిసి ఒకే కారులో బయలుదేరారు. ఈ సందర్భంగా పెళ్లింట సందడిని కెమెరాలో బంధిస్తున్న ఫోటోగ్రాఫర్, కాస్త ఓవర్ గా వ్యవహరించాడు. నడిరోడ్డుపైకి వెళ్లి మరి.. నూతన దంపతుల ఫోటోలు తీసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన ఓ కారు.. ఫోటోగ్రాఫర్ ను ఢీ కొట్టింది. దీంతో అతడు గాల్లోకి ఎగిరి కొంత దూరంలో పడ్డాడు. ఇక వెంట‌నే అల‌ర్ట్ అయిన‌ పెళ్లింటి కుటుంబ సభ్యులు.. అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ గా మారింది. క్లిక్

Next Story