- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నోట్లో కెమెరా.. కాళ్లలో ఫుట్‌బాల్.. కుక్క డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా!
సోషల్ మీడియాలో నిత్యం పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి.

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో (Social media) నిత్యం పెంపుడు జంతువులకు (Pets) సంబంధించిన వీడియోలు తెగ వైరల్ (Viral) అవుతుంటాయి. ముఖ్యంగా కుక్కపిల్లలకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అవి చేసే అల్లరి చేష్టలు చూసి మురిసిపోతుంటారు. తాజాగా ఓ కుక్కపిల్ల ఫుట్‌బాల్ (Football) ఆడుతున్న వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో ఓ కుక్కపిల్ల ఫుట్‌బాల్ ఆడుతున్న తీరు చూస్తే ఏ ప్రొఫెషనల్ ప్లేయర్‌కి తక్కువేమీ కాదు అనిపిస్తుంది.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ పార్క్‌లో కుక్కపిల్ల తన నోట్లో హ్యాండ్ కెమెరా పెట్టుకుని ఫుట్‌బాల్ ఆడుతూ కనిపిస్తోంది. తాను పరుగెత్తుతూ, తన ముందున్న బంతిని కాళ్లతో కంట్రోల్ చేస్తూ ముందుకు సాగుతోంది. కెమెరా యాంగిల్ నుంచే చూస్తే, ఆ కుక్క చూపిన ఫుట్‌వర్క్, ఫోకస్, ఆటలోని చాతుర్యం ఆశ్చర్యాన్ని కలిగించేదిగా ఉంది. ఈ వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతంగా లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారు. 'ఈ కుక్కను నెక్స్ట్ వరల్డ్ కప్‌కి పంపండి!' అంటూ కొందరు, 'ప్రొఫెషనల్ ఆటగాళ్లకు ఇది ఓ సవాల్‌గా మారేలా ఉంది!' అంటూ మరికొందరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఈ కుక్కపిల్ల నిజంగానే సోషల్ మీడియా ఫుట్‌బాల్ స్టార్ అయింది.






