పెళ్లిలో అదిరిపోయే ప్లాన్‌..మంచినీళ్ల లాగే మ‌జ్జిగ తాగొచ్చు

by velandi.Saikiran |

పెళ్లిలో మజ్జిగ అందించేందుకు మంచినీళ్ల త‌ర‌హాలో కుళాయిలే పెట్టేసారు. ఈ సంఘటన గుజరాత్ లోని పాటన్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

పెళ్లిలో అదిరిపోయే ప్లాన్‌..మంచినీళ్ల లాగే మ‌జ్జిగ తాగొచ్చు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ వ్యాప్తంగా ఈ పెళ్లిళ్ల హవా కొనసాగుతోంది. అయితే ఎండాకాల‌మైన‌ నేపథ్యంలో పెళ్లిళ్లకు వెళ్లేందుకు జనాలు వణికిపోతున్నారు. అయినప్పటికీ కొంత మంది ధైర్యం చేసి పెళ్లిళ్లకు వెళ్లి, ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఎండాకాలం పెళ్లిళ్లు జరిగితే కచ్చితంగా చల్లటి నీళ్లు, మజ్జిగ ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ గ్లాసుల్లో లిమిట్ గానే అందిస్తారు. అయితే తాజాగా జరిగిన ఓ పెళ్లిలో మజ్జిగ అందించేందుకు మంచినీళ్ల త‌ర‌హాలో కుళాయిలే పెట్టేసారు. ఈ సంఘటన గుజరాత్ లోని పాటన్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

మంచినీళ్ల లాగే మ‌జ్జిగ తాగొచ్చు

ఈ పాటన్ ప్రాంతానికి సంబంధించిన ఓ రైతు తన కూతురి పెళ్లి చేశాడు. ఈ సందర్భంగా మంచి భోజనం పెట్టించిన సదరు రైతు, పెళ్లికి వచ్చిన వాళ్లకు ఊహించని రీతిలో మజ్జిగ అందించాడు. రెండు వాటర్ ట్యాంకర్ల మజ్జిగ తెప్పించి, కుళాయిలు ఏర్పాటు చేశాడు. తమకు నచ్చినంత మజ్జిగ తాగేలాగా ఏర్పాటు చేశాడు. దీంతో పెళ్లికి వచ్చిన బంధు మిత్రులు, ఎగబడి మరి మజ్జిగ తాగారు. కొంత మంది బాటిల్స్ లో నింపుకొని ఇంటికి కూడా తీసుకెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ అశ్చ‌ర్య‌పోతున్నారు. ఆ పెళ్లి చేసిన వ్యక్తి కడుపు చల్లగా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story