- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముద్దుకు రూ.50 వేలు.. చాట్ డిలీట్‌కు రూ.50 లక్షలు.. ఆ స్కూల్ లేడీ బాస్ రేటు చాలా హాటు
ఈ మధ్యకాలంలో చాలా మంది మహిళలు, పురుషులు పెళ్లై పిల్లలు ఉన్నా కూడా వేరే వాళ్లతో సంబంధాలు పెట్టుకుంటున్నారు.

దిశ, ఫీచర్స్: ఈ మధ్యకాలంలో చాలా మంది మహిళలు, పురుషులు పెళ్లై పిల్లలు ఉన్నా కూడా వేరే వాళ్లతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. కొన్నాళ్లు బాగానే ఉన్న ఇలాంటి రిలేషన్స్ ఒకనొక టైమ్‌కు చేరుకున్నప్పుడు దారుణాలు జరుగుతున్నాయి. వదిలేద్దాం అన్న వదిలించుకోలేని పరిస్థితుల్లో కొంత మంది ఫ్యామిలీస్‌ను పోగొట్టుకుంటుంటే.. మరి కొందరు డబ్బు, ఆస్తీ పొగొట్టుకుంటున్నారు. ఇక ఆకరికి చేసేది ఏమి లేక మరికొందరు పోలీసుల చెంతకు చేరుతున్నారు. ఇలాంటి ఘటన బెంగుళూరులో జరిగింది.
బెంగుళూరు మహాలక్ష్మి సొసైటీకి చెందిన శ్రీదేవి అనే యువతి ప్రీ స్కూల్ నిర్వహిస్తుంది. అదే ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారి తన పిల్లలను శ్రీదేవి స్కూల్లో చేర్పించాడు. ఈ క్రమంలోనే శ్రీదేవికి ఆ వ్యాపారితో పరిచయం ఏర్పడింది. ఆ స్నేహంతో శ్రీదేవి వ్యాపారి వద్ద రూ. 2లక్షలు అప్పుగా తీసుకుని 2024లో చెల్లిస్తానని చెప్పింది. ఇక్కడితో ఆగని వారి స్నేహం మరింత ముందుకు వెళ్లింది. దీన్ని ఆసరాగా తీసుకున్న శ్రీదేవి ఆ వ్యాపారి దగ్గర ఒక ముద్దుకు రూ.50 వేలు వసూలు చేసేది. అయితే.. వ్యాపారి తన వద్ద తీసుకున్న అప్పు మొత్తం చెల్లించాలని కోరగా.. ఏం కావాలో చెప్తే సెటిల్ చేసుకుందాం అంటూ అతడితో బేరం కుదుర్చుకుంది స్కూల్ నిర్వహకురాలు. దీంతో లీవ్‌ఇన్ రిలేషన్‌లో ఉండమని వ్యాపారి కోరడంతో వారి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో వ్యాపారి వద్ద శ్రీదేవి రూ.15 లక్షల వరకు వసూలు చేసింది. ఫిబ్రవరిలో మరోసారి డబ్బులు డిమాండ్ చేయడంతో విసుగు చెందిన వ్యాపారి ఆమెను దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు.
అది గమనించిన శ్రీదేది.. మార్చి 12న వ్యాపారి భార్యకు ఫోన్ చేసి పిల్లల టీసీ కోసం తన భర్తను పంపమని చెప్పింది. అక్కడికి వ్యాపారి వెళ్ళేసరికి పక్కా ప్లాన్ ప్రకారం బీజాపూర్‌కు చెందిన గణేష్ కాలె, సాగర్ అనే రౌడీ షీటర్లును రప్పించింది శ్రీదేవి. వారి మధ్య వాగ్వాదం అనంతరం రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని రూ.1.90 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకొని వ్యాపారిని వదిలేశారు రౌడీ షీటర్లు. ఇక మార్చి 17న శ్రీదేవి వ్యాపారికి మరోసారి ఫోన్ చేసి రూ.50 లక్షలు ఇస్తే చాట్ డిలీట్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. దీంతో విసిగిపోయిన వ్యాపారి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వ్యాపారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు.. శ్రీదేవితో పాటు ఇద్దరు రౌడీ షీటర్లను అరెస్టు చేశారు.






