- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేక్ తొక్కురా...స్టీరింగ్ తిప్పురా...బస్సు డ్రైవింగ్ వీడియో వైరల్
బస్ డ్రైవింగ్ నేర్పుతున్న క్రమంలో... ఓ కర్ర చేతిలో పట్టుకున్నాడు సదరు ట్రైనర్. గేర్ వేయరాకపోయినా..

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో ఫన్నీ, క్రైమ్, వింత వీడియోలు వస్తుంటాయి. ఈ తరుణంలోనే...బస్సు డ్రైవింగ్ ట్రైనింగ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో డ్రైవింగ్ నేర్చుకునే వ్యక్తికి చుక్కలు చూపించాడు ట్రైనర్. ఈ సంఘటన తెలంగాణలో జరిగినట్లు సమాచారం. ఆ ట్రైనర్ మాట్లాడిన భాష చూస్తే అర్థం చేసుకోవచ్చు.
ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బస్సు డ్రైవింగ్ నేర్చుకునేందుకు ఓ సీనియర్ ట్రైనర్ దగ్గరకు వచ్చాడు ఓ వ్యక్తి. ఆ ట్రైనర్ కు దాదాపు 60 నుంచి 70 ఏళ్లు ఉంటాయి. అతనికి ఓపిక ఏ మాత్రం లేదు. ఇక బస్ డ్రైవింగ్ నేర్పుతున్న క్రమంలో... ఓ కర్ర చేతిలో పట్టుకున్నాడు సదరు ట్రైనర్. గేర్ వేయరాకపోయినా.. స్ట్రీరింగ్ తిప్పడం కాస్త లేట్ అయినా తిట్టేస్తున్నాడు. దీంతో విసుగెత్తిన కుర్రాడు.. ఏం చేయాలో తొచక... కన్ఫూజ్ అయ్యాడు. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్.. తెగ నవ్వుకుంటున్నారు. వీడేం ట్రైనర్ రా అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. కాస్త ప్రశాంతంగా నేర్పించాలి కానీ.. అలా అరువకూడదని అంటున్నారు. క్లిక్






