- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోతి చేతిలో రూ.500 నోట్ల కట్టలు... చిత్తు కాగితాల లాగా చేసి!
ఓ వ్యక్తికి సంబంధించిన బ్యాగ్ తీసుకువెళ్లింది కోతి. అందులో ఉన్న 500 రూపాయల నోట్లను చేతిలో పట్టుకొని చెట్టు ఎక్కింది

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో.. రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా ట్రెండ్ అవుతాయి. ఈ నేపథ్యంలోనే.. ఓ కోతికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. సాధారణంగా కోతులు... తినే వస్తువులను లాగేసుకొని వెళ్లడం మనం చూస్తూ ఉంటాం.
తినే వస్తువులు కాబట్టి కచ్చితంగా అవి తీసుకెళ్తాయి. కానీ తాజాగా.. ఓ వ్యక్తికి సంబంధించిన బ్యాగ్ తీసుకువెళ్లింది కోతి. అందులో ఉన్న 500 రూపాయల నోట్లను చేతిలో పట్టుకొని చెట్టు ఎక్కింది. తినే వస్తువులు అనుకోని.. హడావిడిగా పైకి వెళ్ళింది. కానీ తీరా చూస్తే.. ఆ నోట్లు కాస్త చిత్తు కాగితాల లాగా ఆ కోతికి కనిపించాయి.
దీంతో చేసేదేమీ లేక ఆ నోట్లను కిందికి విసిరేసింది కోతి. కొన్నిటిని చిత్తు కాగితాల లాగా చింపేసింది. అయితే దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ నవ్వుకుంటున్నారు. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే తింటుంది కానీ... డబ్బులు దొరికితే.. ఏం చేస్తుంది లే అంటూ కామెంట్ చేస్తున్నారు.






