Bumper Offer: చెన్నైలో ఇండియా, ఇంగ్లాండ్ టీ20 మ్యాచ్.. ప్రేక్షకులకు టీసీఏ బంపర్ ఆఫర్

by Kema Shiva Kumar |

పొట్టి ఓవర్ల సమరానికి టీమిండియా (Team India) సన్నద్ధమైంది.

Bumper Offer: చెన్నైలో ఇండియా, ఇంగ్లాండ్ టీ20 మ్యాచ్.. ప్రేక్షకులకు టీసీఏ బంపర్ ఆఫర్
X

దిశ, వెబ్‌డెస్క్: పొట్టి ఓవర్ల సమరానికి టీమిండియా (Team India) సన్నద్ధమైంది. ఇంగ్లాండ్‌ (England)తో స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ కొల్‌కతా (Kolkata)లోని ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) మైదానం వేదికైంది. ఇక రెండో టీ20 చెన్నై (Chennai)లోని చేపాక్ స్టేడియం (Chepak Stadium)లో శనివారం జరగనుంది. ఈ క్రమంలోనే ప్రేక్షకులకు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (Tamilnadu Cricket Association) బంపర్ ఆఫర్‌ (Bumper Offer)ను ప్రకటించింది.

మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియం‌కు వచ్చే ప్రేక్షకులకు ఫ్రీ మెట్రో (Free Metro) ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లుగా ప్రకటించింది. మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుకోవాలని టీసీఏ (TCA) ప్రతినిధులు వెల్లడించారు. కాగా, 2023 ఐపీఎల్ (IPL) సీజన్‌లో చెన్నై (Chennai)లో జరిగిన మ్యాచ్‌లకు ఇలానే ఫ్రీ మెట్రో (Free Metro) జర్నీని అందించారు. చెపాక్ (Chepak) చుట్టుకప్కల ప్రాంతాల్లో ట్రాఫిక్‌ (Traffic)ను నియంత్రించేందుకు ఇలాంటి ప్రయోగం చేసినట్లుగా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.

Next Story