- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VIRAL VIDEO: భారీ వరదల్లో నుండి బయటపడ్డ బసవన్నలు
by Ajay Maddhiboyina |
భారీ వరదల్లో నుండి రెండు బసవన్నలు బయటపడ్డాయి. ఓ కాలువ వద్ద మేత మేస్తుండగా భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వరద ప్రవాహం పోటెత్తింది.

X
దిశ, వెబ్ డెస్క్: భారీ వరదల్లో నుండి రెండు బసవన్నలు బయటపడ్డాయి. ఓ కాలువ వద్ద మేత మేస్తుండగా భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో కొంతదూరం వరకు అవి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఒకటైతే దాదాపు ప్రవాహంలో కొట్టుకుపోయినట్టే కనిపిస్తుంది. కానీ చివరికి ఎంతో ప్రయత్నించి ఒడ్డుకు చేరుకుంది.
దాని వెంటనే మరొకటి కూడా ఒడ్డుకు చేరింది. ఒడ్డుకు చేరిన అనంతరం అవి ఆనందంతో ఎగిరి గంతులు వేశాయి. అప్పుడే పుట్టి లేగదూడ మాదిరిగా గంతులు వేశాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ప్రకృతే ఆ ఎద్దులను కాపాడిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో పూర్తి సమాచారం లేదు కానీ ఇండియాలోనే జరిగినట్టు కనిపిస్తోంది. VIDEO
Next Story






