- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న బుల్లెట్ బాబా ఆలయం
ప్రస్తుతం ఇంటర్నెట్లో ఓ ఆలయం తెగ వైరల్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ఇంటర్నెట్లో ఓ ఆలయం తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా దేవుళ్ళకు, దేవతలకు గుడి కడతారు. ఇంకాస్త ముందుకు వెళ్లి తమకు బాగా నచ్చిన సినీ తారలకో, ప్రముఖులకో గుడి కట్టడం చేస్తుంటారు. కానీ విచిత్రంగా బైక్ కు ఆలయం కట్టారు స్థానికులు. రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో ఈ బుల్లెట్ బాబా ఆలయం ఉంది. ఇక్కడ గర్భగుడిలో దేవుడి స్థానంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ ఉంటుంది.
1988లో రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకుడు ఓం సింగ్ రాథోడ్ ఉపయోగించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ భక్తుల పూజలు అందుకుంటోంది. ప్రమాదంలో అక్కడ పడిఉన్న బైక్ ను పోలీస్ స్టేషన్‌కు తరలించినా.. రాత్రికి రాత్రి ప్రమాదం జరిగిన చోటికి తిరిగి రావడంతో పోలీసులతోపాటు, స్థానికులు ఆశ్చర్యపోయారట. ఎన్నిసార్లు బైక్‌ను వేరే చోటుకి తరలించినా తిరిగి అదే చోటికి వస్తుండటంతో స్థానికులు గుడి కట్టి, "బుల్లెట్ బాబా" ఆలయంగా నామకరణం చేసి, ఆరాధిస్తున్నారు.
ఇక ఈ ఆలయం రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడుతుందని నమ్మి, బైకర్లు, ట్రావెలర్లు ఇక్కడ మద్యం ప్రసాదంగా సమర్పించి, బైక్ బాబాకు మాలలు వేసి మొక్కుతారు. బైకుకు మద్యం పోసే వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవడంతో.. దేశ-విదేశీ పర్యాటకులు ఆలయానికి క్యూ కడుతున్నారట.






