- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Video:నడిరోడ్డుపై వ్యక్తిని కొమ్ములతో ఈడ్చుకెళ్లిన ఎద్దు.. చివరికి!?(భయానక దృశ్యాలు)
నడిరోడ్డు పై ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది.

దిశ,వెబ్‌డెస్క్: నడిరోడ్డు పై ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. ఢిల్లీ(Delhi)లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కన తన బైక్ వద్ద నిల్చున్న వృద్ధుడిపై అటువైపుగా వస్తున్న ఎద్దు ఒక్కసారిగా దాడికి దిగింది. ఆ తర్వాత ఏమైందంటే.. దేశరాజధాని ఢిల్లీలోని ఛత్తర్‌పూర్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఓ వృద్ధుడు స్కూటీ దగ్గర నిల్చున్నాడు. ఈ క్రమంలో ఎక్కడినుంచి వచ్చిందో ఏమో కానీ.. ఓ ఎద్దు అతనిపైకి ఆగ్రహంతో దూసుకెళ్లింది. ఈ తరుణంలో ఆ వ్యక్తి పై విచక్షణారహితంగా దాడి చేసింది. తన పదునైన కొమ్ములతో ఆ వ్యక్తిని పైకి లేపి.. కిందపడేసి, కాళ్లతో తొక్కింది. అంతటితో ఆగకుండా ఆ వ్యక్తిని నడిరోడ్డు పైకి కొమ్ములతో ఈడ్చుకెళ్ళింది.
ఈ భయానక ఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఆ వృద్ధుడిని రక్షించేందుకు ప్రయత్నించారు. కర్రలు, రాళ్లతో గిత్తను తరిమేయడానికి ప్రయత్నించగా.. ఆ ఎద్దు వారిపైకి దాడికి దిగింది. ఈ క్రమంలో ఓ మహిళను కొమ్ములతో కిందకు తోసేసింది. స్థానికులు చాలా సమయం ప్రయత్నించగా చివరికి.. ఎద్దును తరిమేసి బాధితుడిని కాపాడారు. తీవ్ర గాయాలతో ఉన్న వృద్ధుడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో పలువురు నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ రోడ్లపై తిరిగే పశువులతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.






