వాటర్ ట్యాంక్ ఎక్కిన ఎద్దు... ఏకంగా 60 అడుగులపైకి!

by velandi.Saikiran |

60 అడుగుల పైకి ఎద్దు ఎక్కింది. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

వాటర్ ట్యాంక్ ఎక్కిన ఎద్దు... ఏకంగా 60 అడుగులపైకి!
X

దిశ‌, వెబ్ డెస్క్ : తమ డిమాండ్లను నెరవేర్చాలని, ప్రేమ వివాహం చేయాలని, ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... తరచూ వాటర్ ట్యాంకర్లు ఎక్కుతూ ఉంటారు నిరసనకారులు. వాటర్ ట్యాంకర్ లేదా సెల్ ఫోన్ టవర్లు ఎక్కి తమ నిరసన తెలుపుతూ ఉంటారు జనాలు. అలాంటి వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

అయితే తాజాగా... ఇలాంటి సంఘటనే జరిగింది. కానీ వాటర్ ట్యాంకర్ ఎక్కింది మనుషులు కాదు.. ఏకంగా ఓ జంతువు. మంచి బలిష్టంగా ఉన్న ఓ ఎద్దు... వాటర్ ట్యాంకర్ ఎక్కింది. వాటర్ ట్యాంకర్ ఎక్కడానికి మెట్లు... సరిగా ఉండడంతో... 60 అడుగుల పైకి ఎద్దు ఎక్కింది. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఎద్దు దేనికోసం ఎక్కిందో తెలియదు కానీ.. ఇది చూసిన స్థానికులు, అధికారులు... దాన్ని కిందికి దించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం దక్కలేదు. అయితే చివరకు ఆ ఎద్దుకు మత్తు ఇంజక్షన్ ఇచ్చినట్లు చెబుతున్నారు. అనంతరం తాళ్లు కట్టి... క్రేన్ సహాయంతో కిందికి దించారట. దాదాపు తొమ్మిది గంటల పాటు ఈ ఆపరేషన్ చేసి.. ఎద్దును కిందికి దించినట్లు చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. క్లిక్

Next Story