సైన్యంలో పనిచేసే కుక్కలకు ఎలా ట్రైనింగ్ ఇస్తారంటే.. వీడియో షేర్ చేసిన బీఎస్ఎఫ్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-17 13:10:20  IST  )

సైన్యంలో పనిచేసే కుక్కలకు ఎలా ట్రైనింగ్ ఇస్తారంటే.. వీడియో షేర్ చేసిన బీఎస్ఎఫ్
X

దిశ, వెబ్ డెస్క్: సైన్యంలో పనిచేసే కుక్కలు.. వీటినే పోలీసు జాగిలాలు అని కూడా అంటారు. హత్య, దొంగతనం,పేలుడు పదార్థాల గుర్తింపు, డ్రగ్స్ లాంటి నేరాలను ఛేదించటంలో ఇవి అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కుక్కలు నేరం జరిగిన ప్రాంతంలోని వస్తువుల వాసన చూసి నేరస్తులను గుర్తిస్తాయి. మరి ఇవి ఇంతలా ఎలా రాటుదేలుతాయి? వీటికి ఇచ్చే శిక్షణ ఎలా ఉంటుంది వంటి విషయాలకు సంబంధించిన వీడియోను బీఎస్ఎఫ్ సోషల్ మీడియాలో పంచుకుంది.

పోలీసు కుక్కల శిక్షణ చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. మొదట 4 నుంచి 6 నెలల వయసు ఉన్న కుక్క పిల్లలను శిక్షణ కేంద్రాలకు తీసుకొస్తారు. వాటికి అక్కడే 8 నెలల పాటు ప్రాథమిక శిక్షణ ఇస్తారు. ప్రాథమిక శిక్షణ అనంతరం పోలీసు విభాగంలోని ఇంటెలిజెన్స్‌, గ్రేహౌండ్స్‌ డిపార్ట్‌మెంట్స్ తమకు ఉపయోగపడేలా వాటిని మార్చుకుంటాయి. జాగిలాలకు శిక్షణ ఇచ్చే సిబ్బంది (హ్యాండ్లర్‌) ప్రత్యేక శిక్షణ పొంది ఉంటారు. మొదటి రెండు మూడు నెలలు వాటిని కూర్చోమనడం, నిల్చోమనడం, సెల్యూట్‌ చేయడం, నేరస్థులను పట్టుకునేలా వేగంగా పరుగెత్తించడం, హర్డిల్స్‌‌‌‌పై నుంచి దూకించడం లాంటివి అలవాటు చేస్తారు. అనంతరం అనుమానితుడిని పట్టుకునే విషయంలో కుక్క ఎంత బలాన్ని ఉపయోగించాలి అనే దానిపై వాటికి శిక్షణ ఇస్తారు. నార్కోటిక్స్‌ (మత్తు పదార్థాలు) పసిగట్టడం, పేలుడు పదార్థాల గుర్తింపుకు అంశాల వారీగా శిక్షణ ఇస్తారు. బాంబ్‌ ఎక్స్‌ప్లోజివ్‌లలో ఉపయోగించే పౌడర్‌‌ల నమూనాలను వాటికి పరిచయం చేస్తారు. అంతేకాదు, అప్పుడప్పుడూ నిర్వహించే మాక్‌డ్రిల్స్‌ ద్వారా వాటికి ప్రాక్టికల్ అనుభవాన్ని అందిస్తారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Click For Tweet Post..

Next Story