- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేదికపైనే పెళ్లి కొడుకు ఫ్రెండ్‌ను చితకబాదిన పెళ్లి కూతురు.. వీడియో వైరల్
పెళ్లి తంతు సాగుతోంది. వధూవరులు వేదికపై నిలబడి.. ఒకరి మెడలో మరొకరు మాల వేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆల్రెడీ వధువు మెడలో వరుడు వరమాల వేయగా..

దిశ, ఫీచర్స్ : పెళ్లి తంతు సాగుతోంది. వధూవరులు వేదికపై నిలబడి.. ఒకరి మెడలో మరొకరు మాల వేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆల్రెడీ వధువు మెడలో వరుడు వరమాల వేయగా.. వధువు తన చేతుల్లో పూలమాలను పట్టుకుని, వరుడి మెడలో వేయడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఆమె ముందుకు అడుగు వేసి మాల వేస్తుంటే.. వరుడి స్నేహితుడు వరుడిని వెనక్కి లాగుతున్నాడు. పలు మార్లు ఇదే జరిగే సరికి వధువుకు చిర్రెత్తిపోయింది. కోపంతో ఊగిపోయిన ఆమె.. పూలమాల పక్కన పెట్టేసి ఆ స్నేహితుడి జట్టు పట్టుకుని కొట్టింది. దీంతో వివాహానికి వచ్చిన బంధువులు అవాక్కయ్యారు. వరుడు కూడా తన స్నేహితుడిని.. భార్య బహిరంగంగా కొట్టడం చూసి షాక్ అయ్యాడు.
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్ల రియాక్షన్ భిన్నంగా ఉంది. చెప్పడం కంటే చేసి చూపించడం బెట్టర్ అని ఇలా చేసిందని.. భవిష్యత్తులో వరుడికి కూడా ఇలాంటి ట్రీట్మెంట్ పక్కాగా ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. అయితే ఇంకొందరు మాత్రం ఇది పూర్తిగా స్క్రిప్టెడ్ అని.. యాక్టింగ్ మరీ వరస్ట్‌గా ఉందంటున్నారు. ఇంకొంచెం యాక్టింగ్ బాగా చేసి ఉంటే వీడియో మరింత వైరల్ అయ్యేదేమో అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






