- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ మంత్రి ఎర్రబెల్లితో ఫోటో వివాదంపై బ్రహ్మానందం క్లారిటీ
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో జరిగిన చిన్నపాటి సంఘటన సోషల్ మీడియాలో దుమారాన్ని రేపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో జరిగిన చిన్నపాటి సంఘటన సోషల్ మీడియాలో దుమారాన్ని రేపింది. మోహన్‌బాబు సినీ ప్రయాణం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్ 22న హైదరాబాద్‌లో నిర్వహించిన MB50 – A Pearl White Tribute వేడుకలో ఈ ఘటన జరిగింది.
ఈ వెంట్‌కు విచ్చేసిన బ్రహ్మానందంను చూసిన ఎర్రబెల్లి, ‘అన్నా.. ఒక ఫోటో’ అంటూ ఆయన చెయ్యి పట్టుకుని ఆపే ప్రయత్నం చేశారు. అయితే బ్రహ్మానందం ఆగకుండా ‘అబ్బే..’ అంటూ, ఎర్రబెల్లి చేయిని పక్కకు జరిపి ముందుకు సాగిపోవడం అక్కడి కెమెరాల్లో రికార్డైంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బ్రహ్మానందం ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విమర్శల నేపథ్యంలో, బ్రహ్మానందం తాజాగా ఒక వీడియో విడుదల చేస్తూ విషయంపై స్పష్టత ఇచ్చారు.
ఎర్రబెల్లి దయాకర్‌రావు, తను ముప్పై ఏళ్ల స్నేహితులమని, సన్నిహిత్యంలోనే అలా సరదాగా స్పందించానని తెలిపారు. ఆ సంఘటనను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఎలాంటి అవమాన భావన తనకు లేదని స్పష్టం చేశారు. తాను కావాలని చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఫంక్షలో తను ఆయన చాలా సేపు మాట్లాడుకున్నామని చెప్పారు. తనను తప్పుగా అర్థం చేసుకున్నారని క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదానికి తెరపడినట్టైంది. వీడియో ఇదే..






