- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియురాలు ఇంటికి ప్రియుడు..గోడ దూకుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడుగా..!
ప్రియురాలు ఇంటికి యువకుడు వెళ్ళాడు. అయితే అంతలోపే... ఆ యువతి తల్లిదండ్రులు ఇంట్లోకి ఎంటర్ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో పుట్టగొడుగుల్లా రకరకాల వీడియోలు వస్తున్నాయి. ఇందులో ఏది నిజమో? ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. అయితే ఇందులో కొన్ని.. వీడియోలు అందరికీ నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. అలాంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి వైరల్ గా మారింది. తన ప్రియురాలు ఇంటికి వెళ్లి ఓ యువకుడు అడ్డంగా దొరికిపోయాడు.
ఆ తర్వాత ఆ యువకుడు పడ్డ కష్టాలను ఈ వీడియోలో చూడవచ్చు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఎవరూ లేరని చెప్పడంతో తన ప్రియురాలు ఇంటికి యువకుడు వెళ్ళాడు. అయితే అంతలోపే... ఆ యువతి తల్లిదండ్రులు ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. దీంతో చేసేదేమీ లేక రేకుల షెడ్డు పైనుంచి... కిందికి దూకి, పారిపోయే ప్రయత్నం చేశాడు ఆమె లవర్.
తన ప్రియుడిని బయటకు పంపించేందుకు ఆ యువతీ కూడా చాలా కష్టపడింది. కానీ చివరికి తాడు పట్టుకొని కిందికి దిగేసరికి... యువతి తండ్రి అతని పట్టుకున్నాడు. అనంతరం యువకుడిని చితకబాదాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంట్లో కాకుండా oyo రూమ్ బుక్ చేసుకుంటే సరిపోయేది అంటూ... సెటైర్లు పేల్చుతున్నారు.
INSTAGRAMME VIDEO






