Viral News : గ్రామం మొత్తానికి చేతబడి.. ప్రాణభయంతో ప్రజలు

by Muthe.Rajitha |

రాత్రికి రాత్రి ఏం జరిగిందో తెలియదు గాని, ఆ గ్రామంలో అనేక ఇళ్లకు చేతబడి(Black Magic) చేశారు.

Viral News : గ్రామం మొత్తానికి చేతబడి.. ప్రాణభయంతో ప్రజలు
X

దిశ, వెబ్ డెస్క్ : రాత్రికి రాత్రి ఏం జరిగిందో తెలియదు గాని, ఆ గ్రామంలో అనేక ఇళ్లకు చేతబడి(Black Magic) చేశారు. తెల్లారేసరికి ఏ ఇంటి ముందు చూసినా పసుపు కుంకుమ, మిరపకాయలు, జాకెట్ ముక్కలు ఉండటంతో చేతబడి చేసి ఉంటారనే భయంతో గ్రామస్తులు బిక్క చచ్చిపోయారు. వివరాల్లోకి వెళితే.. ఏపీ(AP)లోని పల్నాడు(Palnadu) జిల్లా బెల్లంకొండ మండలం పులిచింతల ప్రాజెక్ట్ సమీపంలో ఉన్న చిన్న గ్రామం అయిన వెంకటాయపాలెం(Venkatayapalem). ఆ గ్రామంలోని ఎస్సీ కాలనీలో సోమవారం ఉదయం నిద్ర లేచి ఇంటి బయటకు వచ్చే సరికి ఎర్ర జాకెట్ ముక్కలో నిమ్మకాయలు, మిరప కాయలు, బూడిద వేసిన ప్యాకెట్ ముగ్గులో కనిపించాయి. దాదాపు పన్నెండు ఇళ్ల ముందు ఇటువంటి ఆనవాళ్లు ఉండటంతో ఒక్కసారిగా స్థానికుల్లో భయాందోళనలకు గురయ్యారు. చేతబడి జరిగిందనే భయంతో ఇళ్ళనుంచి బయటికి రాకుండా బిక్కు బిక్కుమంటూ గంటలు గంటలు ఇళ్ళల్లోనే గడిపారు. కాగా కొందరు 100 డయల్ చేసి విషయం తెలపగా.. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దీనిపై పోలీసులు ఓవైపు విచారణ జరుపుతుండగానే.. ఊరి ప్రజలంతా గుడిలో ప్రమాణం చేయాలనే నిర్ణయానికి వచ్చారు గ్రామస్తులు. అయితే పోలీసులు మాత్రం ఎవరో ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి ధైర్యం చెప్పారు.

Next Story